
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం `ఫ్యామిలీ స్టార్` చిత్రంలో నటిస్తున్నారు. `గీత గోవిందం` ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్ధమవుతుంది. వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో సినిమాలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది యూనిట్. ఇప్పటికే గ్లింప్స్ విడుదల చేశారు. ఓ పాటని విడుదల చేశారు.
ఇప్పుడు టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. టీజర్ రిలీజ్ డేట్, టైమ్‌ని ప్రకటించింది. రేపు మార్చి 4న సాయంత్రం ఆరున్నరకి విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది యూనిట్. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ లుంగీ పైకెత్తి బ్యాక్ సైడ్ నుంచి నిలబడి ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. మాస్, క్లాస్ మేళవింపుగా ఈ పోస్టర్ ఉంది. సినిమా కూడా ఫ్యామిలీ ఎలిమెంట్లతో సాగుతుంది. అదే సమయంలో యాక్షన్ కూడా ఉందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది.
మరోసారి `ఖుషి`, `గోతగోవిందం` స్టయిల్ లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు విజయ్ దేవరకొండ. గత చిత్రం `ఖుషి` మంచి ఆదరణ పొందింది. దీంతో ఇప్పుడు `ఫ్యామిలీ స్టార్`తో హిట్ అందుకోవాలనుకుంటున్నాడు. ఈ సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురు చేశారు విజయ్.