
`సక్సెస్ చూసి చాలా ఏళ్లు అవుతుంది. చివరగా ఎప్పుడు వచ్చిందో గుర్తుకు కూడా లేదు. ఇన్నాళ్లు మీరంతా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న మీ అందరికి మొహంలో ఖుషి తీసుకురావాలని కోరుకుంటున్నా. ఆ నవ్వు తీసుకొస్తాను. అందరికంటే ముఖ్యంగా సమంత మొహంలో నవ్వు చూడాలి` అని తెలిపారు విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా సమంత హీరోయిన్‌గా నటించిన చిత్రం `ఖుషి`. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో `ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్` నిర్వహించారు.
ఇందులో విజయ్, సమంత క్రేజీ ఎంట్రీ ఇచ్చారు. డాన్సులతో అదరగొట్టారు. షర్ట్ విప్పిమరీ డాన్సులు చేయడం హైలైట్‌గా నిలిచింది. దీంతో ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. ఇక ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, గతేడాది ఏప్రిల్‌లో నవ్వుతూ ఈ సినిమాని ప్రారంభించాం. అంతా సాఫీగా సాగింది. ఇంకా 30 శాతం షూటింగ్ పెండింగ్ ఉంది. సమంత మూడు రోజులు వస్తే ఆమె పార్ట్ అయిపోతుంది. వస్తుందని భావించాం, కానీ తన ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే అయిపోతుందనుకున్నాం, కానీ సెట్ కాలేదని చెప్పింది.
అలా రెండు మూడు వారాలు రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుందనుకున్నాం. కానీ కావడం లేదు. ఆ తర్వాత ఓ ఈవెంట్‌లో తెలిసింది సమంత ఓ పెద్ద ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది. అప్పుడు చాలా బాధగా అనిపించింది. అయితే సమంత గురించి ఈ విషయాలు చెప్పకూడదని అనుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే.. ఇలాంటి సమస్య చాలా మందికి వచ్చింది. కరోనా తర్వాత చాలా మంది ఇలాంటి హెల్త్ ఇష్యూస్‌ని ఫేస్ చేస్తున్నారు. సమస్య ఉన్నప్పటికీ మనం పనిచేయోచ్చని, బాధపడాల్సిన పనిలేదని చెప్పేందుకు ఈ విషయం చెబుతుంది. సమంత అది చేసింది. తన లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఫైట్స్ చేసింది. కోలుకుని సినిమా షూటింగ్‌లు చేసింది. ఇప్పుడు మీ కోసం డాన్సు చేసింది. ఇప్పటికీ ఆమె హెల్త్ సరిగా లేదు. లైట్స్ పడితే తలనొప్పి వస్తుంది, కళ్లకి ఇబ్బంది ఉంటుంది. అయినా ఇక్కడికి మీ కోసం వచ్చింది. `ఖుషి` సినిమా హిట్‌తో ఆమె ఫేస్‌లో నవ్వు చూడాలనుకుంటున్నా` అని తెలిపారు విజయ్.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ గురించి చెబుతూ, సినిమా కోసం ఎంతో వెయిట్ చేశాడు. మధ్యల ఒకటి రెండు సార్లు ఆగిపోయినా, ఆయన ఫేస్‌లో నవ్వు తగ్గలేదు. అదే మెయింటేన్ చేశారు. మధ్యలో వేరే సినిమాకి వెళ్లిపోతున్నారనే కామెంట్లు వచ్చాయి. కానీ తన కోసం ఆయన వెయిట్ చేశాడు. నన్ను ఆయన ఎంత ప్రేమించాడో ఆ ప్రేమని సినిమాలో పెట్టాడు. అంతే ప్రేమించి సినిమాని తీశాడు. కచ్చితంగా అలరిస్తుంది.
నాకు హిట్ వచ్చి చాలా రోజులవుతుంది. హీరోగా జర్నీ స్టార్ట్ చేసి ఆరేడు ఏళ్లు అవుతుంది. ఈ జర్నీలో ఎంతో హైట్స్ చూశా, లోస్ చూశాను. నా చూట్టూ చాలా మంది మారిపోయారు. కానీ నాపై మీ(అభిమానులను ఉద్దేశించి) ప్రేమ తగ్గలేదు. అదే ప్రేమని చూపిస్తున్నారు. అలాగే చాలా కాలంగా మీరంతా హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ మొహంలో నవ్వు చూడాలని కోరుకుంటున్నా. సెప్టెంబర్ 1న మీ మొహంలో నవ్వు చూస్తానని ఆశిస్తున్నా` అని తెలిపారు విజయ్. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్, కెమెరా మెన్, నిర్మాతలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.