క్లీంకార ఫస్ట్ ఫోటో శేర్ చేసిన ఉపాసన, జెండా వందనం చేసిన రామ్ చరణ్ కూతురు..

By Mahesh Jujjuri  |  First Published Aug 15, 2023, 10:57 PM IST

ఫస్ట్ టైమ్ తన గారాల పట్టి క్లింకార ఫోటోను చూపించి చూపించకుండా చూపించేసింది మెగా కోడలు ఉపాసన. ఆమె పోస్ట్ తో సోషల్ మీడియాలో మెగా వారసురాలి ఫోటో వైరట్ అవుతోంది. 
 


రామ్ చరణ్, ఉపాసన పెళైన 11 ఏళ్ల గ్యాప్ తరువాత రీసెంట్ గానే  తల్లిదండ్రులు అయ్యారు. ఈ సంగతి తెలిసిందే. మెగా వారసురాలికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఈ వారసురాలితో ఇటు నాయనమ్మ-తాతయ్యలు సురేఖ- మెగాస్టార్ చిరంజీవి అటు అమ్మమ్మ-తాతయ్య శోభన-అనిల్ కామినేని దిల్ ఖుష్ అవుతున్నారు. తమ సమయాన్ని మనవరాలితో సంతోషంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు రామ్ చరణ్ కూడా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి మరీ..  కూతురితో ఆడుకుంటున్నాడు. తన గారాల పట్టిని వదిలి ఉండలేక.. ఎక్కువ టైమ్ క్లింకారకు ఇచ్చేస్తున్నాడు. 

ఇక ఇది ఇలా ఉండగా... ఈరోజు ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమ గారాపట్టి ఫోటోను కాస్తచూపించి చూపించకుండా శేర్ చేసుకుంది ఉపాసన. ఈరోజు ప్రతీ ఒక్కరు 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈక్రమంలో ఇక మెగా వారసురాలు కూడా తన మొదటి సారిగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పాల్గొంది. అంతే కాదు తన స్వహస్తాలతో ఆ త్రివర్ణ పతాకాన్నిఎగరవేసింది. తన అమ్మమ్మ-తాతయ్యతో కలిసి జెండా వందనం చేసింది. 

Latest Videos

 

undefined

ఇక ఈ కార్యక్రమానికి సబంధిచిన  ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా చేశారు. క్లీంకార ఫస్ట్ ఇండిపెండెన్స్ డే విత్ అమ్మమ్మ-తాతయ్య. అమూల్యమైన క్షణాల అంటూ ఇన్ స్టా లో రాసుకొచ్చారు ఉపాస. ఈ ఫోటోలో.. క్లింకార ఫేస్ సరిగ్గా కనిపించకుండా కవర్ చేశారు. అంతే కాదు లంగా జాకెట్ వేసుకుని ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది మెగావారింటి గారాల పట్టి క్లింకార. ఇక ఈ పోటోతో పాటు ఉపాసన ఫోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

రామ్ చరణ్ కాని ఉపాసన కాని.. మెగా ఫ్యామిలీ ఎవరూ.. ఇంత వరకూ..  క్లీంకార పేస్ ని రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఉపాసన షేర్ చేసిన ఫొటోల్లో క్లీంకార పేస్ కొంచమే కనిపిస్తుంది. ఆ కొంచెం కనిపిస్తే చాలు అంటూ.. పండగ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ అంతే కాదు లవ్ సింబల్స్ తో కామెంట్స్ బాక్స్ ని నింపేస్తున్నారు. 
 

click me!