సుహాస్ లేటెస్ట్ ఫిల్మ్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ చిత్రానికి డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ Vijay Deverakonda సపోర్ట్ చేశారు. ఇప్పటికే సినిమా చూశానని... విడుదలకు ముందే రివ్యూ కూడా ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
‘కలర్ ఫొటో’, ‘హిట్ 2’ సినిమాలతో సుహాస్ (Suhas) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గానే తండ్రిగా ప్రమోషన్ అందుకున్న సుహాస్... నెక్ట్స్ హీరోగా ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సుహాస్ సినిమాకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ Vijay Deverakonda సపోర్ట్ చేశారు. టీమ్ కు తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.
సుహాస్ లేటెస్ట్ ఫిల్మ్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band). ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ కూడా సపోర్ట్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా బిగ్ టికెట్ ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సినిమాను చూసిన విజయ్ దేవరకొండ మూవీ చాలా బాగుందంటూ ప్రశంసించారు. ఇదొక స్పెషల్ ఫిల్మ్ అని, తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ బిగ్ టికెట్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమా ప్రమోషన్ లో భాగమవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా టీజర్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ మూవీ టీమ్ లోని ప్రతి ఒక్కరూ నాకు దగ్గర వాళ్లు. ఈ ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి ఒక స్పెషల్ మూవీ రాబోతోంది. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు నెక్ట్ లెవెల్ లో ఉన్నాయి. సుహాస్ ఎప్పటిలాగా చాలా బాగా నటించాడు. శరణ్య అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఏ సినిమాకైనా ఫస్ట్ హాఫ్ చూశాక కొంత విరామం తీసుకునే నేను ఈ సినిమాకు కంటిన్యూగా ఫుల్ మూవీ చూశాను. అంత క్యూరియస్ గా అనిపించింది. మీరు కూడా థియేటర్ లో ఇదే ఫీల్ అవుతారు..... అంటూ చెప్పుకొచ్చారు. ఇక విజయ్ దేవరకొండ నుంచి నెక్ట్స్ ‘ఫ్యామిలీ స్టార్’ Family Star’ ప్రేక్షకుల ముందుకు రానుంది.