వేట ప్రారంభించిన విజయ్‌ దేవరకొండ.. గౌతమ్‌ తిన్ననూరి సినిమా రెగ్యూలర్‌ షూట్‌ స్టార్ట్..

Published : Jun 16, 2023, 08:20 PM IST
వేట ప్రారంభించిన విజయ్‌ దేవరకొండ.. గౌతమ్‌ తిన్ననూరి సినిమా రెగ్యూలర్‌ షూట్‌ స్టార్ట్..

సారాంశం

విజయ్‌ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోంది. `వీడీ12` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన కొత్త పోస్టర్‌ ఆకట్టుకుంటుంది.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం `ఖుషి` చిత్రంలో  నటిస్తున్న ఆయన.. ఇటీవలే పరశురామ్‌ సినిమాని ప్రారంభించాడు. తాజాగా గౌతమ్‌ తిన్ననూరి సినిమా రెగ్యూలర్‌ షూట్‌ని స్టార్ట్ చేశారు. శుక్రవారం నుంచి ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. విజయ్‌ దేవరకొండ 12 వ సినిమాగా ఇది రూపొందుతుంది. పీరియాడికల్‌ డ్రామా నేపథ్యంలో గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ని నేటి నుంచి హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ప్రారంభించారు. 

తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది యూనిట్‌. ఇందులో విజయ్‌ దేవరకొండ గన్‌ పేలుస్తూ కనిపిస్తున్నారు. ఆ పొగ వెనకాల విజయ్‌ ఫేస్‌ కనిపిస్తుంది. బ్లాక్‌ టోన్‌లో పోస్టర్‌ ఉంది. యాక్షన్‌ కథతో ఈ సినిమా రూపొందుతుందని, ఇందులో గూఢచారిగా విజయ్‌ దేవరకొండ కనిపిస్తారని తెలుస్తుంది. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లోనూ విజయ్ లుక్‌ అందుకు దగ్గరగా ఉంది. ఇక విజయ్‌ దేవరకొండకి జోడీగా యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల కథానాయికగా నటిస్తుండటం విశేషం. 

`జెర్సీ` వంటి జాతీయ అవార్డు సినిమాని రూపొందించిన గౌతమ్‌ తిన్ననూరి నుంచి వస్తోన్న సినిమా కావడం, విజయ్‌ దేవరకొండ స్పైగా కనిపించడం, శ్రీలీల హీరోయిన్‌ కావడం వంటి అంశాలతో ఈ సినిమాపై క్రేజ్‌ నెలకొంది. ప్రారంభం ముందే మంచి హైప్‌ నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. గిరీష్‌ గంగాధర్‌ కెమెరామెన్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, అవినాష్‌ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా ఈ సినిమాకి పనిచేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఆ మధ్య ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పేపర్లు కట్‌ చేసినట్టుగా, వాటి బ్యాక్‌ డ్రాప్‌లో విజయ్‌ ఫేస్‌, కింద బ్లాక్‌ లో పోస్టర్‌ ఉంది. అది వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆ వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తాజాగా ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌ అవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా