
ప్రభాస్ ఫ్యాన్స్ దాడికి గురైన వ్యక్తి మాట్లాడుతూ... వాళ్ళు బాధపడినా నేను ఉన్నదే మాట్లాడాను. సినిమా బాగుంటే బాగుంది అంటాం, నచ్చకపోతే నచ్చలేదంటాం. నాపై దాడి చేసిన ఫ్యాన్స్ మీద కోపం లేదు. పైగా జాలేస్తుంది. దర్శకుడు ఓం రౌత్ అంటే పీకల దాకా కోపం ఉంది. ఆ కోపాన్ని నా మీద తీర్చుకున్నారు. ప్రభాస్ నన్ను ఇంటికి పిలిచి భోజనం పెడితే బాగుంటుంది. ముందే చెబుతున్నా నేను ప్యూర్ వెజిటేరియన్, మాంసాహారం తినను, అని చెప్పుకొచ్చాడు.
ఆ వ్యక్తి ఆదిపురుష్ మూవీ బాగాలేదని అన్నాడు. ఆచార్యలో చిరంజీవి మాదిరి ప్రభాస్ ని రాముడిగా త్రీడీలో చూపించారు. రాముడిగా ప్రభాస్ బాగోలేదు. నాకు సినిమా నచ్చలేదు. పెద్ద రాడ్ అని కామెంట్ చేశాడు. దీంతో అక్కడే ఉన్న ప్రభాస్ అభిమానులు చితకబాదారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.
ఆదిపురుష్ మూవీ నేడు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేశారు. తెల్లవారుజామునుంచే ఆదిపురుష్ చిత్ర ప్రదర్శనళ్లు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులు థియేటర్స్ కి పోటెత్తారు. ఆదిపురుష్ థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. పెద్ద పెద్ద కట్ ఔట్స్ ఏర్పాటు చేశారు. పూజలు నిర్వహిస్తున్నారు.
ఆదిపురుష్ రామాయణగాథగా తెరక్కింది. రాముడు పాత్రలో ప్రభాస్ కనిపించారు. జానకి పాత్రలో కృతి సనన్ నటించారు. జానకిని అపహరించే లంకేశ్వరుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. కెరీర్లో మొదటిసారి ప్రభాస్ పౌరాణిక చిత్రం చేశారు. అందులోనూ ఐకానిక్ రాముడు పాత్రలో మెప్పించారు.
దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ తెరకెక్కింది. టి సిరీస్ బ్యానర్లో భూషణ్ కుమార్ నిర్మించారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు. జూన్ 16న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేశారు. ఆదిపురుష్ చిత్రంపై భారీ హైప్ నెలకొనగా పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ దక్కాయి. ఆదిపురుష్ ఫస్ట్ డే వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండనున్నాయి. మూవీ మాత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. వీకెండ్ ముగిస్తే కానీ చిత్ర ఫలితం పై అవగాహన రాదు.