Family Star Glimpse: విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా `ఫ్యామిలీ స్టార్‌`.. గ్లింప్స్ అదిరింది..

Published : Oct 18, 2023, 07:59 PM IST
Family Star Glimpse: విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా `ఫ్యామిలీ స్టార్‌`.. గ్లింప్స్ అదిరింది..

సారాంశం

`గీత గోవిందం` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతుంది. తాజాగా దీనికి `ఫ్యామిలీ స్టార్‌` అనే టైటిల్‌ని ఖరారు  చేశారు.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) మళ్లీ ఫ్యామిలీ బాట పట్టాడు. ఆయన `గీత గోవిందం`, ఇటీవల వచ్చిన `ఖుషి` చిత్రాలతో లవ్‌ కమ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలు చేశారు. `ఖుషి`లో పెళ్లి తర్వాత స్ట్రగుల్స్ చూపించారు. ఇప్పుడు కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్నారు. పరశురామ్‌ చిత్రంలో ఆయన ఫ్యామిలీ స్టార్‌గా కనిపిస్తున్నారు. అవును.. ఈ చిత్రానికి `ఫ్యామిలీ స్టార్‌`(Family Star)గా టైటిల్‌ని ఖరారు చేశారు. 

ఈ మేరకు బుధవారం సాయంత్రం `ఫ్యామిలీ స్టార్‌`(Family Star Glimpse)  చిత్రం నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో టైటిల్‌కి తగ్గట్టుగానే ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తున్నారు విజయ్‌ దేవరకొండ. గ్లింప్స్ లో ఫ్యామిలీ టచ్‌తోపాటు యాక్షన్‌ చూపించారు. క్లాసీగా కొట్టుడు అదిరిపోయింది. ఇక గ్లింప్స్ ప్రారంభంలో.. `లైన్ లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్ కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కు పంపించడాలు అనుకున్నావా సెటిల్ మెంట్‌ అంటే ` అని అజయ్‌ ఘోస్‌ గాంభీర్యంగా అనగా, భలే మాట్లాడతారన్నా మీరంతా. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా, పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా, ఏ ఐరెన్ వంచాలా ఏంటి అంటూ ఐరన్‌ వంచుతూ డైలాగ్‌ చెప్పిన అదిరిపోయింది. 

అంతేకాదు విలన్ గ్యాంగ్ లోని ఒకడి తల పగలగొట్టి సారీ బాబాయ్.. కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయా, తలకాయ కొట్టేశా` అని విలన్ కి కూల్‌గా వార్నింగ్‌ ఇచ్చిన తీరు అదిరిపోయింది. ఇక చివరగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న విజయ్‌ దేవరకొండని హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ `ఏమండి` అంటూ పిలవగానే విజయ్‌ ఫ్రీజ్‌ అయిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ మేళవించి ఉన్న కూల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా దీన్ని దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. 

`గీత గోవిందం` తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం `ఫ్యామిలీ స్టార్‌`. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మొత్తానికి `గీతగోవిందం`తో వంద కోట్లు వసూలు చేసి స్టార్‌ అయిపోయాడు విజయ్‌. ఇప్పుడు మరోసారి బ్లాక్‌ బస్టర్‌ని కొట్టేందుకు రెడీ అవుతున్నారు. మరి `గీతగోవిందం` మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా ? అనేది చూడాలి. ఈ చిత్రానికి కేయూ మోహనన్‌ కెమెరామెన్‌గా, గోపీసుందర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, ఏఎస్ ప్రకాష్‌ ఆర్ట్ డైరెక్టర్‌గా, మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు