కాశ్మీర్ అందాలు ఆస్వాదిస్తున్న విజయ్ దేవరకొండ, ఫ్యాన్స్ తో వీడియో శేర్ చేసుకున్న రౌడీ హీరో

Published : May 14, 2022, 09:12 AM IST
కాశ్మీర్ అందాలు ఆస్వాదిస్తున్న విజయ్ దేవరకొండ,  ఫ్యాన్స్ తో వీడియో శేర్ చేసుకున్న రౌడీ హీరో

సారాంశం

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవకొండ కాశ్మీ్ర లో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా అప్ డేట్స్ కూడా ఇస్తున్నాడు. రీసెంట్ గా విజయ్ తన ఫ్యాన్స్ కోసం ఓ వీడియోను శేర్ చేశాడు. 

ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు తెరకెక్కించే పనిలో ఉన్నాడు. కరోనా వల్ల వచ్చిన గ్యాప్ ను ఫాస్ట్ గా ఫిల్ చేసి.. ఫ్యాన్స్ కు తనకు మధ్య దూరం తగ్గించే ప్రయత్నంలో ఉన్నాడు. రీసెంట్ గా లైగర్ వర్క్ ను కంప్లీట్ చేసిన విజయ్ తన నెక్ట్స్ సినిమాల పనుల్లో బిజీ అయిపోయాడు. 

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమా కంప్లీట్ చేశాడు విజయ్, టాలీవుడ్ మూవీగా స్టార్ట్ అయిన ఈ సినిమా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తోడు అవ్వడంతో పాన్ ఇండియా మూవీగా మారిపోయింది. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ మైక్ టైసన్ కూడా గెస్ట్ రోల్ చేశారు. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. అగస్ట్ 25న ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 

ఇక లైగర్ తరువాత కూడా విజయ్ పూరీ జగన్నాథ్ తో మరో సినిమా చేయబోతున్నాడు. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగనమణ ను రౌడీ హీరో తోనే చేయబోతున్నాడు పూరీ. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈలోపు విజయ్ గతంలో కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే శివ నిర్వాణతో సినిమా స్టార్ట్ చేశాడు. ఈమూవీలో సమంత విజయ్ జంటగా నటిస్తోంది మహానటి తరువాత విజయ్ దేవరకొండతో సమంత నటిస్తున్న సెకండ్ ఫిల్మ్ ఇది. ఇక మజిలీ తరువాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత నటిస్తున్న సెకండ్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. 

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా తెగ సందడి చేస్తున్నారు టీమ్. అక్కడి విశేషాలు స్టార్స్ సోషల్ మీడియలో పంచుకుంటున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఓ వీడియోను శేర్ చేసుకున్నాడు. షూటింగ్ గ్యాప్ లో కాశ్మీర్ అందాలను ఆస్వాదిస్తున్న యంగ్ హీరో.. హ్యాపీగా బోడ్ రైడ్ చేస్తూ.. చిల్ అవుతున్నాడు. దీనికి సంబంధించి వీడియదో ను తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేశాడు విజయ్. 

 

ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక రౌడీ హీరో లేడీ ప్యాన్స్ అయితే ఈ వీడియోలో విజయ్ డబుల్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడంటున్నారు. ఈ సినిమాలో విజయ్ లుక్ ఇదే అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు. సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటున్నారు ఫ్యాన్స్.  

విజయ్ దేవరకోండ శివ నిర్వాణతో పాటు సుకుమార్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే అది ఇప్పట్లో పట్టాలు ఎక్కే అవకాశం కనిపించడం లేదు. అల్లు అర్జున్ తో పుష్ప సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అవ్వడంతో పుష్ప పార్ట్ 2పై దృష్టి పెట్టాడు సుకుమార్. ఈమూవీ కంప్లీట్ అయిన తరువాతే నెక్ట్స్ ప్రాజెక్ట్ అంటున్నాడు. ఈలోపు విజయ్ దేవరకొండ శివ నిర్వాణతో పాటు పూరీ జనగణమణ సినిమా కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్