బాలీవుడ్ పరువు తీసేస్తున్న రామ్ గోపాల్ వర్మ, మరీ అంత దారుణంగానా..?

By Mahesh JujjuriFirst Published May 14, 2022, 8:07 AM IST
Highlights

ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్న వర్మ.. మరోసారి బీ టౌన్ పరువు ధారుణంగా తీసి వదిలిపెట్టాడు. సౌత్ సినిమాను పొగడ్తలతోముంచెత్తుతున్న వర్మ.. బాలీవుడ్ ను అదే రేంజ్ లో ఆడుకుంటున్నారు. 

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఈమధ్య ఇంకా ఎక్కువగా సంచలనాలు చేస్తున్నారు. ట్విట్టర్ బాణాలు, మాటల తూటాలతో దడదడలాడిస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్న వర్మ.. మరోసారి బీ టౌన్ పరువు దారుణంగా తీసి వదిలిపెట్టాడు. 

సెన్సేషనల్ స్టార్ డైరెక్టర్ రామ్  గోపాల్ వర్మ ఏం చేసినా, ఏది మాట్లాడినా సంచలనమే. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి న్యూస్ ఐటమ్ గా నిలుస్తుంటారు వర్మ. ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సౌత్ నార్త్, ఇండస్ట్రీ వార్ లో వర్మ కామెంట్స్  జనాల్లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. ఎప్పుడు ఆయన స్పందిస్తారా అని ఎదురు చూస్తుంటారు జనాలు. 

ఈ మధ్య బాలీవుడ్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు వర్మ. ఎప్పుడూ తన సినిమాలు వివాదం అయ్యేవి, వాటి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. ఆతరువాత తను ఎవరికైనా కౌంటర్ వేయాలి అనకుంటే.. వెంటనే ఏదో ఒక రకంగా పరువు తీసి వదిలేస్తుంటారు వార్మ. ఆ విషయంలో పక్కాగా ప్రిపేర్డ్ గా ఉంటారు. అవతలివారు నోరు మూసేలా సమాధానం చెపుతుంటారు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ సినిమల గురించి గట్టిగా ట్రోల్ చేస్తున్నారు వర్మ. 

 

The way SOUTH films seem to be going in theatres and NORTH films don’t seem to be going, it looks like BOLLYWOOD should be soon making films only for OTT 😳

— Ram Gopal Varma (@RGVzoomin)

తాజాగా బాలీవుడ్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ పని అయిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. సౌత్ సినిమాలు భారీగా పుంజు కోవడం.. బాలీవుడ్ సినిమాలు ధారుణంగా పడిపోవడం చూస్తుంటే .. కేవలం ఓటీటీల కే బాలీవుడ్ సినిమాలు పరిమితం అయ్యే రోజులు రకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయని వర్మ అన్నారు. 

పుష్ప సినిమా పార్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయినప్పటి నుంచీ.. వర్మ ఇలా బాలీవుడ్ పై సెటైర్లు వేయడం ప్రారంభమయింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు  తిరుగు లేని విజయం సాధించిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ఈ డోస్ ను  మరింత పెంచారు. సౌత్ సినిమాలు బాలీవుడ్ ని కంప్లీట్ గా  డామినేట్ చేస్తున్నాయనే చర్చ ఇప్పటికే పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ టైంలో వర్మ  వ్యాఖ్యలు వివాదాన్ని మరింత  పెంచుతున్నాయి. 

click me!