ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఈమధ్య స్పోర్డ్స్ డిపార్టమెంట్ నుంచి వలసలు ఎక్కువ అయ్యాయి. బ్రాండ్ అంబాసిడర్స్ గా సిల్వర్ స్క్రీన్ మిద మెరిసే స్టార్లు.. డైరెక్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఇతర రంగాల నుంచి వలసలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా స్పోర్డ్స్ నుంచి ఎక్కువంగా సినిమాల వైపు ఆకర్షితులు అవుతున్నారు స్టార్స్. ఇప్పటికే చాలా మంది స్పోర్డ్స్ పర్సన్స్ ఈ రంగంలో రాణించగా.. ఇప్పుడు మరికొంత మంది సినీమా వైపు రావడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
టీమిండియా మాజీ సారథి స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇక సినీ రంగ ప్రవేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు ఉన్న ఇమేజ్ కు పక్కాగా హీరోగానే ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు ఫ్యాన్స్ కాని.. అభిమానులను నిరాశపరుస్తూ..ధోనీ.. నిర్మాతగా మాత్రమే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అది కూడా తమిళ ఫిలమ్మ్ ఇండస్ట్రీ నుంచి సినిమా నిర్మించబోతున్నట్టు సమాచారం.
ధోనీ నిర్మాతగా కోలీవుడ్ లోకి అడుగు పెట్టుబోతున్నాడని తెలుస్తోంది. ధోనీ నిర్మాణ సంస్థలో రాబోయే ఆ తొలి సినిమాకు హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందని సమాచారం. ధోనీ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ద్వారా తమిళ అభిమాన గణాన్ని పెంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా ద్వారా ఆ అభిమాన బలగాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమైపోయాడు.
అయితే ధోనీ నిర్మాత, నయన తార లీడ్ రోల్ అయితే మరి డైరెక్టర్ ఎవరు అన్నదానిపైమాత్రం ఇంత వరకూ క్లారిటీ లేదు. నయనతార లీడ్ రోల్ కాబట్టి.. ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ అని అర్దం అయిపోతోంది. కాని సినిమాకు కథ ఎవరు ఇస్తున్నారు. డైరెక్ట్ ఎ వరు అనేది త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
గతంలో ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్, దిశా పటానీ, కియారా అద్వానీల కాంబోలో ఎంఎస్ ధోనీ–ద అన్ టోల్డ్ స్టోరీ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ సూపర్ సక్సెస్ అందుకుంది.