ఫారెన్ టూర్ లో చిల్ అవుతున్న విజయ్ దేవరకొండ, ఎక్కడున్నాడంటే..?

Published : Dec 17, 2023, 10:50 AM IST
ఫారెన్ టూర్ లో చిల్ అవుతున్న విజయ్ దేవరకొండ, ఎక్కడున్నాడంటే..?

సారాంశం

ఫారెన్ టూర్ లో చిల్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. నైట్ లైట్ డిన్నర్ లో రౌడీ హీరో ఎంజాయ్ చేస్తున్నఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

టాలీవుడ్  రౌడీ హీరో  విజ‌య్ దేవ‌ర‌కొండ వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్నాడు.  రీసెంట్ గా ఖుషి సినిమాతో పర్వాలేదనిపించాడు. సమంతతో కలిసి సందడి చేశాడు విజయ్ దేవరకొండ. ఇక అర్జున్ రెడ్ది లాంటి మాస్ మసాలా సినిమాను చేసిన విజయ్.. ప్రస్తుతం అన్ని ఫ్యామిలీ మూవీస్ చేస్తున్నాడు. ఈక్రమంలో ప్ర‌స్తుతం  విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే మూవీ చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.  విజయ్ దేవరకొండతో గీత గోవిందం లాంటి హిట్ మూవీని అందించిన పరశురామ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. 

ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. రౌడీ హీరో షూటింగ్ లో పాల్గొంటూ.. ఖాళీ టైమ్ ను ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాడు. అమెరికాలో  చిల్ అవుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు ఢిల్లీలో జరిగిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని న్యూ జెర్సీలో జరుపుకుంటోంది. షూటింగ్ కు పేకప్ చెప్పగానే అమెరికా వీధుల్లో షికార్లు చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. 

 

ఇక షూటింగ్ అనంత‌రం రాత్రి డిన్న‌ర్‌కు ఓ స్టార్ హోట‌ల్‌కు వెళ్లిన విజ‌య్ అక్కడ దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతాన్నందిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ, పరశురామ్ కాంబోలో ఇంత‌కుముందు వ‌చ్చిన ‘గీత గోవిందం’ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా మెప్పించిన ఈ సినిమాతోనే విజ‌య్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్ వ‌చ్చింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండకు హిట్టు చాలా అవసరం.ఖషి సినిమా హిట్ అయినా... ప్రస్తుతం విజయ్ ఉన్న పరిస్థితుల్లో .. ఆయన కెరీర్ ను అదిలిప్ట్ చేయలేదు. దాంతో సాలిడ్ హిట్ పడితే మళ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. లైగర్ దెబ్బతో కాస్త తగ్గాడువిజయ్.. ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. కాంట్రవర్సియల్ కామెంట్స్ కు దూరంగా ఉంటున్నాడు. దాంతో తనకు గీత గోవందంతో లైఫ్ ఇచ్చిన పరశురామ్ కు మళ్ళీ  అవకాశం ఇచ్చాడు విజయ్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే
రష్మిక మందన్న, రణ్ వీర్ సింగ్, రిషబ్ శెట్టితో పాటు, 2025లో బెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా?