ఐశ్వర్య రాయ్ కూతురిలో సౌందర్య పోలికలు.! ఆకట్టుకుంటున్న ఆరాధ్య బచ్చన్ క్యూట్ వీడియో

Published : Dec 17, 2023, 10:42 AM IST
ఐశ్వర్య రాయ్ కూతురిలో సౌందర్య పోలికలు.! ఆకట్టుకుంటున్న ఆరాధ్య బచ్చన్ క్యూట్ వీడియో

సారాంశం

ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ మొట్టమొదటిసారిగా స్టేజీ పెర్ఫామెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. తను హావభావాలు, నటనతీరు సౌందర్యను పోలి ఉండటం ఆసక్తికరంగా మారింది.   

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan) కూతురు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. స్టార్ కిడ్ సూల్లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో ఇచ్చి స్టేజీ పెర్ఫామెన్స్ కు అభిమానులతో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. ఆంగ్ల నాటకంలో చక్కగా నటించడం.. స్పష్టంగా ఇంగ్లీష్ యాక్సెంట్ లో డైలాగ్స్ కూడా చెబుతుండటం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

అయితే, కొందరు నెటిజన్లు ఆరాధ్య బచ్చన్ ను దివంగత నటి, ఫ్యామిలీ హీరోయిన్ సౌందర్య (Soundarya)తో పోల్చడం ఆసక్తికరంగా మారింది. ఆరాధ్య బచ్చన్ స్టేజీ పెర్పామెన్స్ ఇచ్చిన కొన్ని స్టిల్స్ ను సౌందర్య ఫొటోలను జతచేస్తూ అచ్చుగుద్దినట్టు ఉందంటున్నారు. వేదికపై ఆరాధ్య పలికించిన హావభావాలు కూడా సౌందర్యకు చాలా దగ్గరగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఫ్యూచర్ లో సినీ పరిశ్రమలో అడుగుపెడితే సౌందర్యలా ప్రేక్షకుల్లో మంచి పేరు దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. 

ప్రస్తుతం ఆరాధ్య బచ్చన్ తన స్కూలింగ్  ను పూర్తి చేస్తోంది. ఇక తల్లితో అప్పుడప్పుడు మీడియాకంట పడుతూనే ఉంటుంది. తన క్యూట్ లుక్స్ తో స్టార్ కిడ్ ఆకట్టుకుంటూనే ఉంటారు. ఇక మొట్టమొదటిసారి ఆరాధ్య బచ్చన్ ఇచ్చిన స్టేజీ పెర్ఫామెన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తల్లి ఐశ్వర్య రాయ్ మురిసిపోయిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌