దేవరకొండ మాటలకు పూరి జగన్ హర్ట్ అవుతాడా?

Published : Jul 23, 2019, 03:39 PM ISTUpdated : Jul 23, 2019, 03:57 PM IST
దేవరకొండ మాటలకు పూరి జగన్ హర్ట్ అవుతాడా?

సారాంశం

పూరి జగన్నాథ్  తో సినిమా గురించి విజయ్ దేవరకొండని అడిగితే.. అసలు అలాంటి ప్రాజక్టే కాదు, ఆలోచనే లేదని తేల్చి చెప్పేసాడు. పూరి జగన్నాథ్ తన తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చినా విజయ్ దేవరకొండ కన్సిడర్ చేయకపోవటం చాలా మందికి షాక్ ఇచ్చిన విషయం. 

డియర్ కామ్రేడ్ రిలీజ్ సమయం ఇది. విజయ్ దేవరకొండ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. బిజీ బిజీ షెడ్యూల్స్ లో తన తాజా చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మీడియావారు ఆయన్ని పూరి, కొరటాల శివలతో సినిమా ఎప్పుడు అని  అడిగారు. అయితే ముక్కు సూటిగా మాట్లాడే విజయ్ ఈ విషయాన్ని రెండు ముక్కల్లో తేల్చి చెప్పాడు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ...కొరటాల శివతో నేను సినిమా చేయాలి. ఈ మేరకు మాటలు జరిగాయి. అయితే శివ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తూ బిజీ గా ఉన్నారు. వచ్చే సంవత్సరం కలిసి మేము డిసైడ్ చేస్తాం అన్నారు. ఇక పూరి జగన్నాథ్  తో సినిమా గురించి అడిగితే ...అసలు అలాంటి ప్రాజక్టే కాదు, ఆలోచనే లేదని తేల్చి చెప్పేసాడు. 

పూరి జగన్నాథ్ తన తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చినా విజయ్ దేవరకొండ కన్సిడర్ చేయకపోవటం చాలా మందికి షాక్ ఇచ్చిన విషయం. మరో ప్రక్క మహేష్ తో అనుకున్న జనగనమణ ప్రాజెక్టుని విజయ్‌ దేవరకొండతో   చేయాలని పూరి జగన్నాధ్‌ చూస్తున్నాడని తెలుస్తోంది.  అంతేకాదు ఇస్మార్ట్‌ శంకర్‌కి ముందు అతన్ని షూటింగ్ ప్లేస్ కు వెళ్లి మరీ కలిసి  డేట్స్‌ కోసం ప్రయత్నించాడు కూడా.  

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్