స్టార్ హీరో సినిమాపై బ్యాన్!

Published : Jul 23, 2019, 03:00 PM IST
స్టార్ హీరో సినిమాపై బ్యాన్!

సారాంశం

మలేషియా ప్రభుత్వం విక్రమ్ నటించిన 'మిస్టర్ కెకె'  సినిమాను నిషేధించింది. మలేషియా పోలీసులను సినిమాలో తప్పుగా చూపించినందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మిస్టర్ కెకె'. కోలీవుడ్ లో 'కదరం కొండన్' అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి తొలి షో నుండే నెగెటివ్ టాక్ రావడంతో విక్రమ్ అభిమానులు నిరాశ చెందారు.

ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి మరో షాక్ తగిలింది. సినిమా ఎక్కువ భాగం షూటింగ్ మలేషియాలోనే జరిగింది. ఇప్పుడు మలేషియా ప్రభుత్వం సినిమాను నిషేధించింది. 

మలేషియా పోలీసులను సినిమాలో తప్పుగా చూపించినందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చిత్ర మలేషియా డిస్ట్రిబ్యూటర్స్ లోటస్ ఫైవ్ స్టార్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాను నటుడు కమల్ హాసన్ నిర్మించాడు. కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. 

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది