#VijayDeverakonda:"జనగణమన" గురించి విజయ్ ని అడిగితే ఏమన్నాడంటే...

By Surya PrakashFirst Published Sep 12, 2022, 9:53 AM IST
Highlights

  "లైగర్" సినిమా డిజాస్టర్ అవడంతో "జనగణమన" సినిమాపై అంచనాలు భారీగా తగ్గిపోయాయి. తాజాగా ఈ సినిమాకి మరొక పెద్ద షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని నిర్మించాల్సిన మై హోమ్ గ్రూప్ వారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులకు 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. 


 పూరీ జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి సినిమా "లైగర్". స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ ను అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా విడుదలకి ముందే విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ తమ కాంబినేషన్లో రెండవ సినిమా అంటూ "జనగణమన" అనే మరొక సినిమాని కూడా ప్రకటించారు. 

కానీ "లైగర్" సినిమా డిజాస్టర్ అవడంతో "జనగణమన" సినిమాపై అంచనాలు భారీగా తగ్గిపోయాయి. తాజాగా ఈ సినిమాకి మరొక పెద్ద షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని నిర్మించాల్సిన మై హోమ్ గ్రూప్ వారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులకు 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. మొదటి రెండు షూటింగ్ షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి కానీ కొన్ని డిస్కషన్ల తర్వాత మాత్రం మై హోం గ్రూప్ వారు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండను ఈ సినిమా గురించి అడిగారు.
 
లైగర్ రిలీజ్  గ్యాప్ త‌ర్వాత అత‌ను మీడియా క‌ళ్ల‌కు చిక్కాడు. బెంగ‌ళూరులో సైమా ప‌దో వార్షికోత్స‌వ వేడుక‌ల‌కు విజ‌య్ హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా అత‌ణ్ని మీడియా జనగనమన సినిమాగురించి ప్రశ్నించింది. అయితే విజ‌య్‌  ఈ సినిమా గురించి అడిగితే అత‌ను స‌మాధానం దాట‌వేశాడు. మ‌నం వ‌చ్చిన సైమా వేడుక‌ల‌ను ఎంజాయ్ చేయ‌డానికి, దానికే ప‌రిమితం అవుదాం అని అత‌ను బ‌దులిచ్చాడు. 

 

సాధారణంగా త‌న ఫెయిల్యూర్ల గురించి విజ‌య్ మాట్లాడ‌డానికి ఎలాంటి ఇబ్బందీ ప‌డ‌డు. ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌ల‌కు కూడా ఈజీగా ఆన్స‌ర్ చేస్తాడు. అలాంటిది జ‌న‌గ‌ణ‌మ‌న గురించి అడిగితే స‌మాధానం చెప్ప‌లేక దాట‌వేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే అంటున్నారు అభిమానులు. మరోవైపు పూరి జగన్నాథ్ మై హోమ్ గ్రూప్ వారి నిర్మాణంలో చేయాల్సిన ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం "జనగణమన" సినిమా కోసం నిర్మాతను వెతుక్కుంటున్నారు పూరి. "లైగర్" సినిమాతో భారీ నష్టాలు అందుకున్న పూరీ జగన్నాథ్ వాటిని భర్తీ చేసే ప్రయత్నాలు చేపట్టగా మరోవైపు జనగణమన సినిమా మళ్లీ మొదలవుతుందో లేదో అని కూడా అనుమానాలు మొదలవుతున్నాయి.

click me!