సోషల్ మీడియా సెలబ్రెటీతో విజయ్ దేవరకొండ ఫైటింగ్.. వైరల్ అవుతున్న వీడియో.!

By team teluguFirst Published Aug 24, 2022, 4:28 PM IST
Highlights

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజాగా సోషల్ మీడియా సెలబ్రెటీ నిహారికపై పంచ్ ల వర్షం కురిపించారు. వీరిద్దరూ పోట్లాడే వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 
 

‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం  ‘లైగర్’ (Liger). ఈ మూవీలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్నారు. రౌడీ హీరో తొలిసారిగా బాక్సర్ గా వెండితెరపై అలరించబోతున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ గా తనలోని ఫైటర్ ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.  పూరీ- విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం రేపే గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మూవీని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.   దీంతో ఆడియెన్స్, ఫ్యాన్స్ చిత్రం కోసం ఎదురుచేస్తున్నారు. ఆడియెన్స్ కు మరింత రీచ్ వచ్చేలా చిత్ర యూనిట్ ఇప్పటికే క్రేజీ ప్రమోషన్స్ నిర్వహించారు. 

అయితే తాజాగా సోషల్ మీడియా సెలబ్రెటీ నిహారిక (Niharika NM)తో విజయ్ దేవరకొండ ప్రమోషనల్ వీడియోను చేశారు. ఈ సందర్భంగా విజయ్ నిహారికపై మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ తో దాడికి దిగారు. అదేవిధంగా నిహారిక కూడా విజయ్ పంచ్ లను ఎదుర్కునే ప్రయత్నం చేసింది. కేవలం ప్రమోషన్ లో భాగంగానే ఈ వీడియోను చిత్రీకరించగా.. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో విజయ్ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.  ఈ క్రమంలోనే నిహారికతో ఇలా ప్రమోషనల్ చేసి.. నెటిజన్లను ఆకట్టుకున్నారు. 

మరోవైపు సౌత్, నార్త్ లో రిలీజ్ అవుతున్న భారీ చిత్రాల ప్రమోషన్స్ కు సోషల్ మీడియాలో ఒక వేదికగా మారింది. అందులోనూ సోషల్ మీడియాలో అప్పటికే పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రెటీలతో ఫన్ వీడియోలను చేస్తూ స్టార్ హీరోలు ఏంచక్క తమ సినిమాలను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ - నిహారిక  ఫైటింగ్ దిగారు. ఫన్ వీడియోలు, ఇనఫర్మేషన్ వీడియోలు చేస్తూ నిహారిక సోషల్ మీడియాలో సెలబ్రెటీగా మారింది. ఇప్పటికే ‘సర్కారు వారి పాట’, ‘మేజర్’, అంతకు ముందు ‘కేజీఎఫ్’ సినిమాలను  క్రేజీగా ప్రమోట్ చేసింది.  ఇప్పటికే 2.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న నిహరిక ఇలా స్టార్స్ తో ప్రమోషనల్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మరింత పాపులారిటీని పెంచుకుంటోంది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niharika Nm (@niharika_nm)

click me!