రిలీజ్ కు ముందే యూఎస్ఏలో ‘లైగర్’ సెన్సేషన్.. ఈ లెక్కన మున్ముందు బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే.!

Published : Aug 24, 2022, 03:21 PM IST
రిలీజ్ కు ముందే యూఎస్ఏలో ‘లైగర్’ సెన్సేషన్.. ఈ లెక్కన మున్ముందు బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే.!

సారాంశం

మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న చిత్రం ‘లైగర్’(Liger). స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ కు ముందే యూఎస్ఏలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.   

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’ (Liger). ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తుండగా.. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రేపే గ్రాండ్ గా (ఆగస్టు 25) ప్రపంచ వ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది. గతంలోనే చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. అలాగే చిత్ర ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ ఒక రేంజ్ లో నిర్వహించడంతో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రెండ్రోజుల కింద బుక్సింగ్స్ కూడా ఓపెన్ కావడంతో తెలుగు స్టేట్స్ లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోతున్నాయి. 

తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ రిలీజ్ కు ముందే యూఎస్ఏలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ట్రేడ్ వర్గాలు తెలుపుతున్న సమాచారం మేరకు ‘లైగర్’ కేవలం ప్రీమియర్స్ తోనే అర మిలియన్ మార్క్ ను అందుకుంటుకుందని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే  రేపు చిత్ర థియేటర్ లోకి వచ్చిన తర్వాత యూఎస్ఏ బాక్సాఫీస్ షేక్ కానుందని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే ‘లైగర్’ టీం కూడా సినిమా పట్ల హామీనిస్తుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది.  ఇక చిత్రం రిలీజ్ సందర్భంగా సినీ తారలు కూడా యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే  మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఆల్ ద బెస్ట్ చెప్పారు. 

‘లైగర్‌’లో విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే  జంటగా నటిస్తున్నారు. Ananya Panday ఈ చిత్రంతోనే సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. సినిమా రిలీజ్ కు ముందే అనన్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. మరోవైపు విజయ్ - అనన్య కెమిస్ట్రీ కూడా అదిరిపోవడంతో సినిమా కోసం యూత్ ఎదురుచూస్తున్నారు. చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై నిర్మించారు. పూరీ, ఛార్మీ, కరణ్ జోహార్ నిర్మాతలుగా ఉన్నారు. తెలుగు, హిందీలో  రూపొందించగా తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్