నాని.. సన్‌రైజర్స్‌ కోసం ఆడాలి: విజయ్ దేవరకొండ

Published : Apr 22, 2019, 11:09 AM IST
నాని.. సన్‌రైజర్స్‌ కోసం ఆడాలి: విజయ్ దేవరకొండ

సారాంశం

నేచురల్ స్టార్ నాని హైదరబాద్ ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్‌ తరఫున ఆడాలని నటుడు విజయ్ దేవరకొండ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

నేచురల్ స్టార్ నాని హైదరబాద్ ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్‌ తరఫున ఆడాలని నటుడు విజయ్ దేవరకొండ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాని నటించిన 'జెర్సీ' సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

ఈ సినిమా చూసిన తరువాత విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ''జెర్సీ సినిమా చూసిన తరువాత మాట రాలేదు. క్లాప్స్ కొట్టాను. నా ప్రేమ మొత్తం నీకే నాని. గౌతం తిన్ననూరి ఫ్యూచర్ లో మీరు చేయబోయే ప్రాజెక్ట్ ల కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాను'' అంటూ రాసుకొచ్చాడు. 

ఫైనల్ గా.. నాని నువ్వు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు తరఫున ఆడాలి అంటూ ప్రశంసలు గుప్పించారు. గతంలో నాని, విజయ్ దేవరకొండ కలిసి 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో నటించారు.

ఇక 'జెర్సీ' సినిమా విషయానికొస్తే.. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసన ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించగా.. శ్రద్ధా శ్రీనాథ్ అతడి భార్యగా నటించింది. మొదటిరోజు నుండే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా కూడా సినిమా దూసుకుపోతుంది. 
 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్
తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?