అభిమాని చర్యతో లారెన్స్ షాక్!

Published : Apr 22, 2019, 10:40 AM IST
అభిమాని చర్యతో లారెన్స్ షాక్!

సారాంశం

ఓ అభిమాని క్రేన్ కి వేలాడుతూ తన కటౌట్ కి పాలాభిషేకం చేయడంపై నటుడు రాఘవ లారెన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఓ అభిమాని క్రేన్ కి వేలాడుతూ తన కటౌట్ కి పాలాభిషేకం చేయడంపై నటుడు రాఘవ లారెన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల లారెన్స్ నటించిన 'కాంచన 3' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో సినిమా థియేటర్ల వద్ద లారెన్స్ భారీ కటౌట్ లు ఏర్పాటు చేశారు. ఆయన్ని దైవంగా భావించే కొందరు అభిమానులు ఆ కటౌట్ కి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. క్రేన్ కొక్కీకి వేలాడుతూ కటౌట్ కి అభిషేకం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీన్ని చూసిన లారెన్స్ షాక్ అయ్యారు. అభిమాని క్రేన్ కి వేలాడుతూ పాలాభిషేకం చేస్తున్న వీడియో చూసి చాలా బాధపడినట్లు చెప్పారు. ఇలాంటి రిస్క్ లను తీసుకోవద్దని అభిమానులను కోరారు. ప్రాణాలని రిస్క్ లో పెట్టి, తనపై ప్రేమను ఇలా చూపడం కరెక్ట్ కాదని, ఇంట్లో వాళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలని సూచించారు. 

నిజంగా తనపై ప్రేమను నిరూపించుకోవాలంటే.. పేద పిల్లలకు పుస్తకాలు, ఆహరం లేకుండా ఇబ్బంది పడుతున్న వృద్ధులకు సహాయం చేయాలని కోరారు. అటువంటి పనులు తనకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటు గర్వపడేలా చేస్తాయని అన్నారు. మరోసారి ఇటువంటి ఘటన జరగకూడదని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?