కపిల్ దేవ్ బయోపిక్ లో విజయ్ దేవరకొండ!

Published : Dec 22, 2018, 04:55 PM IST
కపిల్ దేవ్ బయోపిక్ లో విజయ్ దేవరకొండ!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో చాలా మంది మేకర్స్ విజయ్ ని పరిచయం చేయాలని చూస్తున్నారు.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో చాలా మంది మేకర్స్ విజయ్ ని పరిచయం చేయాలని చూస్తున్నారు.

'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిన దర్శకనిర్మాతలు ఆయనతో సినిమా చేయాలని చూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే విజయ్ బాలీవుడ్ లో నటించబోతున్నాడట. ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా దర్శకుడు కబీర్ ఖాన్ సినిమా చేయబోతున్నాడు.

దీనికి '83' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ కనిపించనున్నాడు. సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం విజయ్ దేవరకొండని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

కపిల్ దేవ్ స్నేహితుడు ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కథకు కీలకమని తెలుస్తోంది. ఈ పాత్రలో విజయ్ దేవరకొండని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్ మొదలుకానుంది. 2020లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా సినిమా విజయ్ నటించడం ఖాయమని అంటున్నారు!

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు