కాకినాడలో అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకుంటా.. విజయ్ దేవరకొండ

Published : Dec 28, 2018, 05:05 PM IST
కాకినాడలో అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకుంటా.. విజయ్ దేవరకొండ

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సరోవర పోర్టు హాల్లో ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. కాకినాడలో ఎవరైనా అమ్మాయి నచ్చితే సెకండ్ థాట్ లేకుండా పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు విజయ్ దేవరకొండ. 

అలానే గోదావరి జిల్లాల్లో కోడి పందేలు బాగా జరుగుతాయని విన్నానని కానీ ఎప్పుడూ చూడలేదని, అవకాశం వస్తే చూడాలని ఆసక్తిగా ఉందని అన్నారు. కాకినాడ, అన్నవరం, రాజమహేంద్రవరంచాలా బాగున్నాయని అన్నారు. షూటింగ్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిందని అన్నారు.

షూటింగ్ కోసం నెలరోజులు ఇక్కడే ఉండడంతో మంచి బంధం ఏర్పడిందని ఎమోషనల్ అయ్యాడు. ఇక్కడ సముద్రం చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్ మీద, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎలాంటి అడ్డు లేకుండా అందరూ సహకరించారని చెప్పుకొచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి