ఫ్యాన్స్ హర్ట్.. ఎంజాయ్ చేస్తోన్న మహేష్!

Published : Dec 28, 2018, 04:48 PM IST
ఫ్యాన్స్ హర్ట్.. ఎంజాయ్ చేస్తోన్న మహేష్!

సారాంశం

వివాదాలకు దూరంగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబుపై పన్ను ఎగవేత కేసుని పెట్టారు అధికారులు. తొమ్మిదేళ్లుగా ప్రకటనల మీద ఆయన సంపాదించిన ఆదాయానికి పన్ను కట్టకుండా ఉన్నందుకు జీఎస్టీ అధికారులు మహేష్ బ్యాంకు అకౌంట్లు సీజ్ చేశారు. 

ఈ విషయం తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. కనీసం ఈ విషయంపై మహేష్ స్పందిస్తాడేమోనని ఎదురుచూస్తున్నారు. కానీ మహేష్ మాత్రం తన కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. 

రీసెంట్ గా తన కుటుంబంతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్న మహేష్ ఇప్పుడు 'మహర్షి' సినిమాకు బ్రేక్ రావడంతో ఈ గ్యాప్ లో దుబాయి చెక్కేశాడు. తన ఫ్యామిలీతో పాటు సన్నిహితులతో అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ విషయం తెలిసి రియాక్ట్ అవ్వడం లేదో.. లేక ఇండియాకి వెళ్లిన తరువాత డీల్ చేద్దామని అనుకున్తున్నాడో.. కానీ ఇప్పటివరకు పన్ను ఎగవేత విషయంపై మహేష్ స్పందించలేదు. 

PREV
click me!

Recommended Stories

AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?