Vijay Devarakonda: అమ్మని హగ్‌ చేసుకుని విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ పోస్ట్.. ప్రేమ తిరిగిస్తానంటూ నోట్‌..వైరల్‌

Published : May 11, 2022, 09:04 AM IST
Vijay Devarakonda: అమ్మని హగ్‌ చేసుకుని విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ పోస్ట్.. ప్రేమ తిరిగిస్తానంటూ నోట్‌..వైరల్‌

సారాంశం

విజయ్‌ దేవరకొండ తన తల్లిని ఉద్దేశించి పెట్టిన ఓ ఎమోషనల్‌ పోస్ట్ వైరల్‌ అవుతుంది. ఈ సందర్భంగా తన తల్లి మాధవిని హగ్‌ చేసుకుని ఉన్న ఫోటోని పంచుకోగా అది వైరల్‌ అవుతుంది. 

విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) పేరు ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో మారుమోగుతుంది. ఆయన బ్యాక్‌ టూ బ్యాక్‌ హ్యాట్రిక్‌ హిట్స్ కొట్టడంతో స్టార్‌ హీరో అయిపోయారు. ఆ తర్వాత నాలుగు సినిమా డిజప్పాయింట్‌ చేసినా విజయ్‌ ఇమేజ్‌ కానీ, క్రేజ్‌గానీ ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగింది. సినిమా విజయాలతో సంబంధం లేకుండా ఆయన్ని అభిమానులు ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారనేదానికిది నిదర్శనంగా చెప్పొచ్చు. 

విజయ్‌ దేవరకొండ ఇటీవల తన పుట్టిన రోజుని జరుపుకున్నారు. కాశ్మీర్‌లో `వీడీ11` చిత్రీకరణలో ఉన్న ఆయన అక్కడే చిత్ర బృందం సమక్షంలో బర్త్ డే చేసుకున్నారు. మరోవైపు `లైగర్‌` సినిమాకి సంబంధించిన సర్‌ప్రైజ్‌ ఇచ్చి ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు. అయితే లేటెస్ట్ గా ఆయన తన తల్లిని ఉద్దేశించి పెట్టిన ఓ ఎమోషనల్‌ పోస్ట్ వైరల్‌ అవుతుంది. ఈ సందర్భంగా తన తల్లి మాధవిని హగ్‌ చేసుకుని ఉన్న ఫోటోని పంచుకోగా అది వైరల్‌ అవుతుంది. Vijay Devarakonda Emotional Post)

త‌న త‌ల్లి మాధ‌వి ప్రేమ‌ను  గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు విజయ్‌. ఇందులో ఆయన చెబుతూ, నాకు 15 సంవత్సరాల వయస్సులో పుట్టినరోజులు జరుపుకోవడం మానేసిన వ్యక్తికి - మీ ప్రేమ నన్ను వారి పట్ల శ్రద్ధ చూపేలా చేసింది. 8 సంవత్సరాల క్రితం, నా పేరు, నా ఉనికి గురించి మీకు తెలియదు, ఈ రోజు మీరు నన్ను ఉత్సాహపరుస్తారు, నాకు మద్దతు ఇస్తున్నారు, నా కోసం పోరాడుతున్నారు, నన్ను నమ్ముతారు, అంతేకాదు చాలా మంది నాకు షరతులు లేని ప్రేమను ఇస్తున్నారు. ఇదంతా మా అమ్మ ఇచ్చిన జ‌న్మే వల్ల సాధ్యమైందంటూ ట్వీట్ చేశాడు విజయ్‌. 

ఇంకా చెబుతూ, `మీరు వెలకట్టలేని ప్రేమని పంచుతున్న సందర్భంగా మీకు ఏదో రూపంలో ఆ ప్రేమని తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. ఒక రకంగా కావొచ్చు, ఇంకో రకంగా కావు, నేను మీరిచ్చే ప్రేమ వల్ల పొందుతున్న ఫీలింగ్‌ని మీరు కూడా నా నుంచి పొందుతారు` అంటూ పేర్కొన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన పెట్టిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. వారిని కదిలిస్తుంది. అమ్మని హగ్‌ చేసుకున్న ఫోటో వైరల్‌ అవుతుంది.

విజయ్ దేవరకొండ త్వరలో `లైగర్‌` చిత్రంతో రాబోతున్నారు. ఆగస్ట్ 25న ఈ చిత్రం విడుదల కాబోతుంది. పాన్‌ ఇండియా చిత్రంగా ఇది రూపొందిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించగా, ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మించారు. దీంతోపాటు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలోనే `జనగణమన` చిత్రంలో నటిస్తున్నారు విజయ్‌. అలాగే శివ నిర్వాణ డైరెక్షన్‌లో `వీడీ11` మూవీ చేస్తున్నారు. ఇందులో సమంత కథానాయిక. ఈ నెల 16న ఫస్ట్ లుక్‌ విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?