'మీకు మాత్రమే చెప్తా' టీజర్: అన్నీ అబద్దాలే.. విజయ్ దేవరకొండ సినిమా!

Published : Sep 06, 2019, 07:30 PM ISTUpdated : Sep 06, 2019, 07:53 PM IST
'మీకు మాత్రమే చెప్తా' టీజర్: అన్నీ అబద్దాలే.. విజయ్ దేవరకొండ సినిమా!

సారాంశం

విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. వాణి భోజన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ అబద్దాలు చెప్పి చిక్కులో పడే వ్యక్తిగా నటిస్తున్నాడు. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా నిర్మాణంలోకి కూడా దిగాడు. తనకు పెళ్లి చూపులు చిత్రంతో విజయం అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్ర టైటిల్ 'మీకు మాత్రమే చెప్తా'. షమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకుడు. 

వాణి భోజన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.  తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేసారు. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లుంది. తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో తన గర్ల్ ఫ్రెండ్ కి అబద్దాలు చెబుతూ ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తిగా నటిస్తున్నాడు. 

నీకు సిగరెట్, డ్రింకింగ్, అమ్మాయిలు లాంటి చెడు అలవాట్లు ఉన్నాయా  అని తన గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్న వాణి భోజన్ ప్రశ్నిస్తుంది. దానికి తరుణ్ భాస్కర్ తడబడుతూ అలాంటి అలవాట్లేవి లేవని అబద్దాలు చెప్పడం ఫన్నీగా ఉంది. 

ఇక అనసూయ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. శివ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, గుణదేవ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. చూడాలి ఈ చిత్రం విడుదలయ్యాక ఎలా మెప్పిస్తుందో. 

 

PREV
click me!

Recommended Stories

Toxic Cast Remuneration: రెమ్యూనరేషన్‌లో యష్‌ కి నయనతార గట్టి పోటీ.. టాక్సిక్ స్టార్ల జీతాల వివరాలు
Sridivya without Makeup: మేకప్ లేకుండా నేచురల్‌ అందంతో కట్టిపడేస్తున్న శ్రీదివ్య.. లేటెస్ట్ ఫోటోలు