నాకు రాజకీయాలు ఇష్టం లేదు.. కానీ చేయాల్సి వస్తే: విజయ్ దేవరకొండ ట్వీట్!

Published : Sep 03, 2018, 05:12 PM ISTUpdated : Sep 09, 2018, 12:02 PM IST
నాకు రాజకీయాలు ఇష్టం లేదు.. కానీ చేయాల్సి వస్తే: విజయ్ దేవరకొండ ట్వీట్!

సారాంశం

'ఐ హేట్ పాలిటిక్స్' అంటూ పొలిటికల్ అవతారంలో ఉన్న తన గెటప్ ని విడుదల చేశాడు హీరో విజయ్ దేవరకొండ. ఇంకా బాక్సాఫీస్ వద్ద 'గీత గోవిందం' హడావిడి తగ్గకముందే తన తదుపరి సినిమా 'నోటా' పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

ఈ పోస్టర్ లో యంగ్ పొలిటీషియన్ లుక్ లో విజయ్ లుక్ ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ లో సత్యరాజ్, నాజర్ వంటి సీనియర్ నటులు కనిపిస్తున్నారు. దీన్ని బట్టి ఈ సినిమాలో విజయ్ సీనియర్ నటులతో పోటీ పడుతున్నాడని అర్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకుడు. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా కనిపించనుంది.

'గీత గోవిందం' సినిమా భారీ వసూళ్లను సాధించడంతో ఈ సినిమాకి ప్రీరిలీజ్ మార్కెట్ లో భారీ డిమాండ్ రావడం ఖాయం. ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ నెల 6న సాయంత్రం 4 గంటలకు సినిమా ట్రైలర్ లో విడుదల చేయనున్నారని పోస్టర్ ద్వారా వెల్లడించారు.   

PREV
click me!

Recommended Stories

పవన్ కళ్యాణ్ తో పోటీ పడి చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Jan 2: అమూల్యకు పెళ్లిచూపులు, ఈలోపే విశ్వక్ అదిరిపోయే ప్లాన్