షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్.. థమన్ కామెంట్!

Published : Sep 03, 2018, 04:43 PM ISTUpdated : Sep 09, 2018, 02:07 PM IST
షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్.. థమన్ కామెంట్!

సారాంశం

జూనియర్ ఎన్టీఆర్ తను ఎంతగానో ప్రేమించిన తన తండ్రి నందమూరి హరికృష్ణను యాక్సిడెంట్ లో కోల్పోయారు. ఈ సంఘటన జరిగి నాలుగురోజులు గడవక ముందే తారక్ 'అరవింద సమేత' సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. 

జూనియర్ ఎన్టీఆర్ తను ఎంతగానో ప్రేమించిన తన తండ్రి నందమూరి హరికృష్ణను యాక్సిడెంట్ లో కోల్పోయారు. ఈ సంఘటన జరిగి నాలుగురోజులు గడవక ముందే తారక్ 'అరవింద సమేత' సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. నిజానికి తారక్ ఈ బాధ నుండి కోలుకోవడానికి సమయం పడుతుందని, ఇప్పట్లో ఆయన షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ లేదనే మాటలు వినిపించాయి.

సినిమా అనుకున్న సమయానికి రాదేమోనని మేకర్స్ కూడా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా తారక్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా.. తిరిగి షూటింగ్ లో పాల్గొన్నాడు. తన కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోకూడదని తారక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్, తదితరులపై కీలక సన్నివేశాలను చితీకరిస్తున్నారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ''అంకితభావానికి ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం. ఆయన డెడికేషన్ చూసిన తరువాత ఆయనపై గౌరవం మరింత పెరిగింది.. మేమంతా మీతో ఉన్నాం. మీకు మరింత బలం చేకూరాలి'' అంటూ ట్వీట్ చేశారు. చకచకా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు