బడా డైరెక్టర్స్ వచ్చినా కుదరదంటున్న రౌడీ హీరో!

Published : Feb 05, 2019, 03:49 PM IST
బడా డైరెక్టర్స్ వచ్చినా కుదరదంటున్న రౌడీ హీరో!

సారాంశం

రెమ్యునరేషన్ కి ఆశపడి  కొంత మంది కథలను పట్టించుకోకుండా ముందుకెళతారు. అలాగే స్టార్ దర్శకులు వస్తే కూడా పెద్దగా ఆలోచించకుండా మొహమాటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వారు కూడా ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం అందుకు బిన్నంగా అడుగులేస్తున్నాడు. 

వరుసగా ఆఫర్స్ వస్తుంటే ఏ సినిమా ఒకే చేయాలో అర్ధం కాదు అంటారు కొంత మంది యువ దర్శకులు. రెమ్యునరేషన్ కి ఆశపడి  కొంత మంది కథలను పట్టించుకోకుండా ముందుకెళతారు. అలాగే స్టార్ దర్శకులు వస్తే కూడా పెద్దగా ఆలోచించకుండా మొహమాటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వారు కూడా ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం అందుకు బిన్నంగా అడుగులేస్తున్నాడు. 

గతంలో చాలా మంది యువ హీరోలు టాప్ స్టేజ్ లోకి వెళ్లి ఒక్కసారిగా బొక్కబోర్ల పడ్డవారు ఉన్నారు. దీంతో విజయ్ కొత్త దర్శకులైనా కూడా కథ నచ్చి అతనిమీద ఓ నమ్మకం కలిగేవరకు ప్రాజెక్టులకు ఒకే చెప్పడం లేదు. రీసెంట్ గా మారుతి కూడా యువ హీరోను కలిసినట్లు తెలుస్తోంది. శైలజా రెడ్డి తో దెబ్బతిన్న ఈ కామెడీ దర్శకుడు రొటీన్ ఫార్మాట్ లోనే కథను చెప్పడంతో విజయ్ నచ్చలేదని మొహం మీదే చెప్పశాడట. 

ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ముందు విజయ్ తో ఒక సినిమా చేద్దామని అనుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. పూరి బాండ్ స్క్రిప్ట్ తో రాకపోవడం వరుస ఫ్లాప్ లు ఉండడంతో విజయ్ చాలా అలోచించి నో చెప్పేశాడట. మరికొంత మంది సీనియర్ దర్శకులు కూడా దేవరకొండ తలుపుతట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ ముందు ఒకే చేసుకున్న ప్రాజెక్టులు ఓ కొలిక్కి వచ్చేవరకు మరో కథను ఓకే చేసే పని పెట్టుకోవద్దని ఈ రౌడీ హీరో కుదరదన్నాడట. ఈ విధంగా విజయ్ నోటా అనంతరం చాలా వరకు తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూనే సక్సెస్ కథలను పసిగడుతున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Karthika Deepam 2 Today Episode: తప్పించుకున్న జ్యో- సుమిత్ర చావుకు ప్లాన్- దీపకు కూడా ఆపద రానుందా?