పవన్ ప్రొడ్యూసర్ తో విజయ్ దేవరకొండ సినిమా.. క్రేజీ డైరెక్టర్ ప్లానింగ్!

Published : Jun 29, 2019, 08:17 PM IST
పవన్ ప్రొడ్యూసర్ తో విజయ్ దేవరకొండ సినిమా.. క్రేజీ డైరెక్టర్ ప్లానింగ్!

సారాంశం

యువ సంచలనం విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. 

యువ సంచలనం విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. మైత్రి నిర్మాణంలో తెరక్కుతున్న ఈ చిత్రంలో విజయ్, రష్మిక జంటగా నటించారు. మరోవైపు క్రాంతి మాధవ్ దర్శత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. 

ఇక మరో క్రేజీ డైరెక్టర్ విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. అతనెవరో కాదు.. 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్. ప్రస్తుతం విక్రమ్ కుమార్ నానితో గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే విజయ్ తో సినిమా పట్టాలెక్కించాలనేది అతడి ప్లాన్. అందుకోసం కథ కూడా సిద్ధం చేసుకున్నాడట. 

త్వరలో విజయ్ దేవరకొండని కలసి కథ వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తో సర్దార్, కాటమరాయుడు చిత్రాలు నిర్మించిన శరత్ మరార్ విక్రమ్ కుమార్ తో ఓ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా