కృష్ణ కుటుంబానికి త్రివిక్రమ్ పరామర్శ!

Published : Jun 29, 2019, 07:54 PM IST
కృష్ణ కుటుంబానికి త్రివిక్రమ్ పరామర్శ!

సారాంశం

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ శనివారం రోజు కృష్ణ నివాసానికి వెళ్లారు. బుధవారం రోజు కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ శనివారం రోజు కృష్ణ నివాసానికి వెళ్లారు. బుధవారం రోజు కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. నటిగా, దర్శకురాలిగా ఆమె సాధించిన విజయాలు చిత్ర పరిశ్రమలోని మహిళలకు ఆదర్శం. 

కృష్ణ నివాసానికి వెళ్లిన త్రివిక్రమ్ వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు. విజయనిర్మల గారి లాంటి బముఖ ప్రజ్ఞాశీలి దూరం కావడం బాధాకరం అని అన్నారు. నరేష్ ని ఓదారుస్తూ ఆయనతో కొంత సమయం గడిపారు. అక్కడే త్రివిక్రమ్ మహేష్ బాబుని కూడా కలుసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో ఓ చిత్రం చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ మహేష్ తో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలని చేశారు. 

PREV
click me!

Recommended Stories

1000 కోట్ల సినిమా ను ఒక ఫ్లాప్ మూవీ కోసం వదిలేసుకున్న నాగార్జున, కారణం ఏంటో తెలుసా?
Soundarya కి ఉన్న అరుదైన హ్యాబీ ఏంటో తెలుసా? ఖాళీ టైమ్‌లో ఆమె చేసి పని ఇదే