అమలాపాల్ మాజీ భర్త రెండో వివాహం.. వధువు ఎవరంటే!

Published : Jun 29, 2019, 07:21 PM IST
అమలాపాల్ మాజీ భర్త రెండో వివాహం.. వధువు ఎవరంటే!

సారాంశం

ప్రముఖ దర్శకుడు విజయ్ రెండో వివాహానికి సిద్ధం అవుతున్నాడు. అమలాపాల్, విజయ్ 2014లో ప్రేమ వివాహాం చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తాయి. 

ప్రముఖ దర్శకుడు విజయ్ రెండో వివాహానికి సిద్ధం అవుతున్నాడు. అమలాపాల్, విజయ్ 2014లో ప్రేమ వివాహాం చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తాయి. సినిమాల్లో నటించే విషయంలో అమలాపాల్, విజయ్ మధ్య మనస్పర్థలు చేటు చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా వీరిద్దరూ 2017లో విడాకులతో విడిపోయారు. 

ఆ తర్వాత విజయ్ రెండో వివాహం గురించి అనేక రూమర్స్ వచ్చాయి. ఇటీవల కూడా విజయ్, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్లని దర్శకుడు విజయ్ ఖండించాడు. తాజాగా అన్ని పుకార్లకు చెక్ పెడుతూ తన రెండో వివాహం గురించి అధికారిక ప్రకటన చేశాడు. 

డాక్టర్ ఐశ్వర్య అనే మహిళని జులై నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు విజయ్ అధికారికంగా ప్రకటించాడు. ఆమె ఫోటో కూడా సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమ వివాహం కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్ గా జరుగుతుందని విజయ్ తెలిపాడు. 

తన సక్సెస్, ఫెయిల్యూర్ లో అండగా నిలిచిన వారికి, సహకరించిన మీడియాకు విజయ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వివాహం పెద్దలు కుదిర్చినది. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌