
లైగర్(Liger) చిత్ర ప్రమోషన్స్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు టీం. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి టీం.. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు వాడుకుంటున్నారు. తాజాగా గాడ్ ఫాదర్(God Father) సెట్స్ కి హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మి వెళ్లడం జరిగింది. గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ కీలక రోల్ చేస్తున్న విషయంలో తెలిసిందే. అలాగే చిరంజీవి, సల్మాన్ కాంబినేషన్ లో ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. దీంతో గాడ్ ఫాదర్ సెట్స్ కి లైగర్ టీం వెళ్లడంతో ఇద్దరు స్టార్స్ ని ఒక్కచోట కలిసినట్లు అయ్యింది.
లైగర్ చిత్రానికి సల్మాన్, చిరంజీవి(Chiranjeevi) బెస్ట్ విషెస్ తెలియజేశారు. మూవీ మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. సల్మాన్, చిరంజీవితో కలిసి విజయ్ దేవరకొండ, ఛార్మి, పూరి జగన్నాథ్ ఫోటోలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఆగస్టు 25న లైగర్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. లైగర్ మూవీలో విజయ్(Vijay Devarakonda) ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తున్నారు. అనన్య పాండే ఆయనకు జంటగా నటిస్తున్నారు.
విడుదలైన లైగర్ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రమ్య కృష్ణ, మైక్ టైసన్ కీలక రోల్స్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.