లైగర్ విడుదల తేదీఫై అప్డేట్!

Published : Feb 10, 2021, 12:57 PM IST
లైగర్ విడుదల తేదీఫై అప్డేట్!

సారాంశం

లైగర్ విడుదల తేదీపై వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇవ్వడం జరిగింది. విజయ్ దేవరకొండ చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ లైగర్ కావడం విశేషం. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనున్నాడు.    

దర్శకుడు పూరి జగన్నాధ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండతో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ లైగర్. విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపించనున్న ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా లైగర్ పలు భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ విడుదల తేదీపై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చారు. 


రేపు ఉదయం 8:14నిమిషాలకు లైగర్ విడుదల తేదీ ప్రకటించనున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈమేరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది. లైగర్ విడుదల తేదీపై వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇవ్వడం జరిగింది. విజయ్ దేవరకొండ చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ లైగర్ కావడం విశేషం. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనున్నాడు.  

ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ విదేశాల్లో ఫైటింగ్ లో శిక్షణ తీసుకున్నారు.  పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి లైగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ లైగర్ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇక అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం
Ranabaali: పూనకాలు తెప్పించేలా విజయ్‌ దేవరకొండ `రణబాలి` టైటిల్ గ్లింప్స్, స్వాతంత్య్రానికి ముందు నాటి చీకటి కోణాలు