వకీల్ సాబ్ కి  రష్మీ గౌతమ్  గ్లామర్ కోటింగ్?

Published : Feb 10, 2021, 10:49 AM IST
వకీల్ సాబ్ కి  రష్మీ గౌతమ్  గ్లామర్ కోటింగ్?

సారాంశం

వకీల్ సాబ్ మూవీలో ఓ ఐటెం సాంగ్ సైతం జోడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సాంగ్ లో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ నటిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొని ఉంది.  దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

వకీల్ సాబ్ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రేట్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న వకీల్ సాబ్ మూవీ విడుదల కానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా ఈ మూవీపై ఓ క్రేజీ గాసిప్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రంలో పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా పలుమార్పులు చేయడం జరిగింది. 


పవన్ కళ్యాణ్ నుండి ఫ్యాన్స్ ఆశించే ఫైట్స్ మరియు సాంగ్స్ ని అసలు కథకు జోడించారు. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ టీజర్ లో పవన్ రౌడీలను దుమ్మురేపుతూ పంచ్ డైలాగ్ విసరగా, ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 
కాగా వకీల్ సాబ్ మూవీలో ఓ ఐటెం సాంగ్ సైతం జోడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సాంగ్ లో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ నటిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొని ఉంది. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

హిందీ హిట్ మూవీ పింక్ కి తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది. పవన్ లాయర్ రోల్ చేస్తుండగా, దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. అంజలి, నివేదా వంటి హీరోయిన్స్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఇక శృతి హాసన్ పవన్ భార్య రోల్ చేశారు. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా