విజయ్‌ దేవరకొండ ఎవరో వాళ్ల గల్లీలో ఒక్కడికి కూడా తెలియదట.. ఏవీడీలో `పుష్పకవిమానం` ప్రీమియర్‌..

Published : Nov 09, 2021, 12:14 AM ISTUpdated : Nov 09, 2021, 12:16 AM IST
విజయ్‌ దేవరకొండ ఎవరో వాళ్ల గల్లీలో ఒక్కడికి కూడా తెలియదట.. ఏవీడీలో `పుష్పకవిమానం` ప్రీమియర్‌..

సారాంశం

మహబూబ్‌ నగర్‌లో ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి విజయ్‌ దేవరకొండ `ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ` పేరుతో మల్టీప్లెక్స్‌ ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన సొంతం సినిమా వేసుకుంటున్నాడు విజయ్‌. 

`సినిమాల్లోకి రాకముందు మా గల్లీలో నేను ఎవరో ఒక్కరికి కూడా తెలియదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాను. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంటున్నాడు` రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda). తాను నిర్మించిన చిత్రం `పుష్పక విమానం`(Pushpaka Vimanam). Vijay Devarakonda తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ(Anand Devarakonda) హీరోగా నటిస్తున్నాడు.  గీత్‌ సైనీ, సాన్వీ మేఘాన కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. 

ఈ సందర్బంగా Pushpaka Vimanam ప్రీమియర్స్ ప్లాన్‌ చేశారు. మహబూబ్‌ నగర్‌లో ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి విజయ్‌ దేవరకొండ `ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ` పేరుతో మల్టీప్లెక్స్‌ ని నిర్మించిన విషయం తెలిసిందే. `లవ్‌ స్టోరీ`తో ఈ థియేటర్‌ ప్రారంభమైంది.ఇప్పుడు తన సొంతం సినిమా వేసుకుంటున్నాడు విజయ్‌. తమ్ముడు నటించగా, తాను నిర్మించిన `పుష్పక విమానం` సినిమాని ప్రదర్శించబోతున్నారు. ఒక్క రోజు ముందే, ఈ నెల 11 సాయంత్రం 7 గంటల షోతో ప్రీమియర్‌ వేయబోతున్నారు. ఈ విషయాన్ని విజయ్‌ ప్రకటించారు.

మరోవైపు ఇటీవల జరిగిన వైజాగ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ మాట్లాడాడు. ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. హీరోగా నేను ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు నిర్మాతలు దొరక్క చాలా కష్టాలు పడ్డాను. నా తరువాత వచ్చేవాళ్లు ఆ కష్టాలు పడకూడదనే ఒక బలమైన ఉద్దేశంతో నేను సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టాను. ఈ బాధ్యతను మోయడం చాలా కష్టంగా ఉంది .. అయినా అవకాశం పొందినవాళ్లు స్టేజ్‌పై మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. కష్టమైనా కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే అనుకుంటున్నాను. మా పేరెంట్స్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బందిపడుతూనే నాకు పెట్రోల్ డబ్బులు ఇచ్చి ఆడిషన్స్‌కి పంపించారు.

సినిమాల్లోకి రాకముందు నేను ఎవరనేది మా గల్లీలో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి నేను ఇప్పుడు ఒక నటుడిగా.. నిర్మాతగా వైజాగ్‌లో స్టేజ్‌పై నిలబడి ఉన్నా. నేను ఈ స్థాయికి రావడానికి కారణం, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ .. మీ మీదున్న ఓవర్ కాన్ఫిడెన్స్‌` అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం విజయ్‌, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వలో `లైగర్‌ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమెరికన్‌ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు `దొరసాని`, `మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌` చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న ఆనంద్‌ దేవరకొండ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రంపై సర్వ్రతా ఆసక్తి నెలకొంది.

also read: Vijay Sethupathi: విజయ్‌ సేతుపతిని తంతే 1001 బహుమతి.. నెట్టింట దుమారం..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్