
విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల భారీ అంచనాల మధ్య శుక్రవారం రిలీజైన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ప్యామిలీలు ఈ సినిమాలు బాగా ఆదరిస్తున్నారని నిర్మాత దిల్ రాజు నమ్మకంగా చెప్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు.
ఇక ఈ మూవీ ఏ ఓటీటీలో వస్తోందన్న విషయంపై అంతటా ఆసక్తి నెలకొంది. పరశురామ్- విజయ్ కాంబో సూపర్ హిట్ కావటంతో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. మొదట నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ హక్కులను దక్కించుకుందని వార్తలొచ్చాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ...ఫ్యామిలీ స్టార్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావడం లేదు.
ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. దీంతో ఫ్యామిలీ స్టార్ నెల రోజుల తర్వాతే ఓటీటీకి రానుంది. అంటే మే నెల రెండో వారంలో లేదా మూడో వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.మరో ప్రక్క ఫ్యామిలీ స్టార్ రిలీజైన ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారికంగా క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
స్టోరీ లైన్:
మిడిల్ క్లాస్ కుర్రాడు 'గోవర్ధన్'(Govardhan)కి ఫ్యామిలీ అంటే ప్రాణం. ఆర్కిటెక్ట్ అయిన అతను ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తూ కుటుంబ బాధ్యతలు అన్నీ తన భుజాల మీదే మోస్తూ ఉంటాడు. ఇంట్లో తనే ఆర్దిక ఆధారం. ఓ ప్రక్కన తాగుడుకు బానిసైన ఒక అన్న(రవి ప్రకాష్) మరో ప్రక్క ఎప్పుడూ ఏదో బిజినెస్ పెట్టుబడి అంటూ తిరిగే మరో అన్న (రాజా చెంబోలు) కు ఆదాయాలు లేకపోవటంతో వాళ్ల ఫ్యామిలీలను తనే సాకాల్సిన పరిస్దితి.
ఇలా తను,తన కుటుంబం, ఉద్యోగం అంటూ వెళ్తున్న గోవర్ధన్ జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్) అనే డబ్బున్న అమ్మాయి వస్తుంది. ఆమె అతను ఇంట్లోకి అద్దెకు దిగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేసే ఆమె వచ్చాక జీవితం మారిపోతుంది. మెదట్లో ఆమెను పట్టించుకోకపోయినా మెల్లిగా ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ప్రేమ ప్రపోజల్ పెట్టే టైమ్ కు ఆమె మన హీరో గోవర్దన్ ఓ ట్విస్ట్ లాంటి షాక్ ఇస్తుంది. ఆ షాక్ ఏంటి..అప్పుడు గోవర్ధన్ ఏం చేశాడు? వాళ్ల ప్రేమ కథ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.