Devara Part 1 : ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్ అప్డేట్.. ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా?

Published : Apr 06, 2024, 09:23 AM IST
Devara Part 1 :  ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్ అప్డేట్.. ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా?

సారాంశం

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR) - కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘దేవర’ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ పై అప్డేట్ వచ్చింది.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’ (Devara). ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)  తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో ‘జనతా గ్యారేజీ’ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘దేవర’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్దిరోజులుగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మధ్య మధ్యలో అప్డేట్స్ కూడా అందిస్తూ వస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ‘దేవర’ చిత్రం  రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. Devara Part 1 ని అక్టోబర్ 10న చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ  భారీ విజువల్స్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్ కారణంగా ఇంకాస్త సమయం తీసుకున్నారు. అయితే ఇంతకీ ఈ మూవీ షూటింగ్ ఎంత వరకు అయ్యిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

తాజాగా ‘దేవర’ మూవీ షూటింగ్ పై అప్డేట్ అందింది. షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశలో ఉందని చెబుతున్నారు. రీసెంట్ గా గోవా షెడ్యూల్ ను ప్రారంభించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)తో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని, ఆ తర్వాత మూడు పాటలు మాత్రమే షూట్ చేయాల్సి ఉంటుందని సమాచారం. జూన్ లోపు అవీ కంప్లీ చేసి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై నిమగ్నమవుతారంట. ఇక త్వరలో ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ ఎత్తున రూపుదిద్దుకుంటోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం