Sunny Leone: హాట్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న సన్నీలియోన్‌.. `జిన్నా` ఫస్ట్ లుక్‌ అదిరిపోయిందంతే..

Published : Aug 10, 2022, 05:28 PM ISTUpdated : Aug 10, 2022, 06:47 PM IST
Sunny Leone: హాట్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న సన్నీలియోన్‌.. `జిన్నా` ఫస్ట్ లుక్‌ అదిరిపోయిందంతే..

సారాంశం

మంచు విష్ణు, పాయల్‌రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ కలిసి నటిస్తున్న `జిన్నా`  చిత్రంలోని సన్నీలియోన్‌ ఫస్ట్ లుక్‌ ని విడుదల చేశారు. ఇందులో ఆమె లుక్‌ చాలా హాట్‌గా ఉండటం విశేషం.

బాలీవుడ్‌ శృంగార తార తెలుగులో పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్న చిత్రం `జిన్నా`(Ginna). మంచు విష్ణు హీరో(Manchu Vishnu)గా రూపొందుతున్న ఈ చిత్రంతో సన్నీలియోన్‌(Sunny Leone)తోపాటు పాయల్‌ రాజ్ పుత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌ మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రంలోని సన్నీలియోన్‌ ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. ఇందులో ఆమె రేనుక పాత్రలో కనిపించబోతుంది. రిలీజ్‌ చేసిన ఫస్ట్ లుక్‌లో జాకెట్‌ విప్పేసి మరీ పొట్టిదైన పింక్‌ స్కర్ట్ ధరించి థైస్‌ అందాలను చూపిస్తూ కనిపిస్తుంది సన్నీలియోన్‌, మరోవైపు బ్రా అందాలు చూపిస్తూ ఆర్టీసీ బస్‌ నుంచి దిగుతున్న సన్నీలియోన్‌ లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ కి గ్లామర్‌ ఫీస్ట్ మామూలుగా ఉండబోదనే సాంకేతాలనిస్తుంది. పల్లెటూరొచ్చిన పట్నం పిల్లలా సన్నీలియోన్‌ పాత్ర ఉండబోతుందని తాజా ఫస్ట్ లుక్‌ చూస్తుంటే అర్థమవుతుంది. 

తెలుగులో ఆమెని చూడాలని ఆడియెన్స్, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, సినిమాలో ఆమె పాత్ర కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజాగా లుక్‌ వారిని ఖుషి చేస్తుందని చెబుతుంది యూనిట్‌. లేటెస్ట్ సన్నీలియోన్‌ ఫస్ట్ లుక్‌ సినిమాపై బజ్‌ని క్రియేట్‌ చేసిందని తెలిపింది. ఇంకా యూనిట్‌ తెలియజేస్తూ, తెలుగు తమిళం, మలయాళం, హిందీ నాలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని తెలిపింది. 

`కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న `జిన్నా` రోజురోజుకు మంచి బజ్‌ని సోంతం చేసుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో విష్ణుతో స‌న్నీ రీల్స్, విష్ణు, ఆయ‌న బృందంతో సన్నీ ఓ చమత్కారమైన రీల్స్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించారు.  'నాటు నాటు' ఫేమ్ ప్రేమ్ రక్షిత్  మాస్ట‌ర్ ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా ప‌ని చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారని చెప్పింది యూనిట్‌. 

తన ఫస్ట్ లుక్‌పై సన్నీలియోన్‌ రియాక్ట్ అవుతూ, తాను నటిస్తున్న రేణుక పాత్రని పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, జిన్నాకి తాను చిన్ననాటి స్నేహితురాలిని అని, కానీ ఆయన జీవితాన్ని తలక్రిందులుగా చేయనని కాదని, ఇది ఊహించని మలుపులతో సాగే క్రేజీ జర్నీ అని తెలిపింది సన్నీలియోన్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?