పవన్ తో విజయ్ దేవరకొండకి పోలిక.. పవన్ ఫ్యాన్స్ ఏం అంటారో?

First Published 22, Aug 2018, 6:17 PM IST
Highlights

తెలుగు సినిమా సెన్సేషన్ గా మారాడు విజయ్ దేవరకొండ. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ యూత్ ఐకాన్ గా మారిపోయాడు. కెరీర్ ఆరంభంలోనే బ్లాక్ బస్టర్స్ అందుకొని అతి తక్కువ కాలంలో స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు

తెలుగు సినిమా సెన్సేషన్ గా మారాడు విజయ్ దేవరకొండ. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ యూత్ ఐకాన్ గా మారిపోయాడు. కెరీర్ ఆరంభంలోనే బ్లాక్ బస్టర్స్ అందుకొని అతి తక్కువ కాలంలో స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా విజయ్ ని పవన్ కళ్యాణ్ తో పోల్చి చూస్తున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్ ఇటీవల స్టేజ్ మీద ఈ టాపిక్ తీసుకురాగా ఇప్పుడు యూత్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

చాలా మంది ఈ విషయంపై తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఉన్న క్రేజ్ ని ఫాలోయింగ్ ని ఏ హీరో బీట్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండకి యూత్ లో ఏర్పడ్డ ఫాలోయింగ్ తో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు పవన్ కంటే కెరీర్ గ్రాఫ్ విషయంలో విజయ్ ముందున్నాడని అంటున్నారు.

విజయ్ నటించిన 'పెళ్లిచూపులు' సినిమా పదికోట్లు వసూలు చేయగా, 'అర్జున్ రెడ్డి' పాతిక కోట్లు వసూలు చేసింది. ఇక 'గీత గోవిందం' సినిమా ఐదు రోజుల్లో రూ.30 కోట్లు వసూలు చేసి రూ.40 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో విజయ్ కి సపోర్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. మూడు సినిమాలకే పవన్ కళ్యాణ్ తో పోల్చి చూసే స్థాయి అతడికి లేదంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

భార్యాపిల్లలతో సహా చిరుని కలిసిన పవన్!

విజయ్ దేవరకొండ షాకింగ్ రెమ్యునరేషన్!

Last Updated 9, Sep 2018, 1:44 PM IST