మళ్లీ ప్రేమికుడ్ని కాలేను.. ప్రభుదేవా కామెంట్స్!

Published : Aug 22, 2018, 04:44 PM ISTUpdated : Sep 09, 2018, 12:33 PM IST
మళ్లీ ప్రేమికుడ్ని కాలేను.. ప్రభుదేవా కామెంట్స్!

సారాంశం

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవా డాన్సర్ గానే కాకుండా నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా ఇలా అన్ని రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవా డాన్సర్ గానే కాకుండా నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా ఇలా అన్ని రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల పాటు నయనతారతో ప్రేమ వ్యవహారంతో హాట్ టాపిక్ అయిన ప్రభుదేవా ఆ తరువాత వారిద్దరికీ బ్రేకప్ కావడంతో పూర్తిగా సినిమాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన నటించిన 'లక్ష్మి' సినిమా విడుదలకు సిద్ధమైంది.

ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. డాన్స్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా గురు శిష్యుల మధ్య సాగే స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలను పంచుకున్నాడు ప్రభుదేవా. ఇక ఆయనకు తెలుగు సినిమా పాటలంటే చాలా ఇష్టమని, ఇక్కడ పాటల్లోని సెట్స్, కాస్ట్యూమ్స్, విజువల్స్ అద్భుతమని పొగిడేశాడు.

అలానే 'ప్రేమికుడు' సినిమా సీక్వెల్ పై స్పందిస్తూ.. 'నేను హీరోగా పరిచయమైన ప్రేమికుడు సినిమాకు సీక్వెల్ చేయమని అడుగుతున్నారు. అప్పుడు వయసుకి ఇప్పుడు వయసుకి చాలా తేడా ఉంది. ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తే ప్రేమికుడు 10 అని పెట్టాలి. ఇప్పటివరకు సీక్వెల్ తీయాలనే ఆలోచన రాలేదు' అంటూ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ