ఈ పాట విని అమ్మ ఏడ్చింది.. విజయ్‌ దేవరకొండ కామెంట్స్!

Published : May 15, 2019, 12:39 PM IST
ఈ పాట విని అమ్మ ఏడ్చింది.. విజయ్‌ దేవరకొండ కామెంట్స్!

సారాంశం

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. 

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా 'కడలల్లే కన్నులే..' అనే పాటను హీరో విజయ్ దేవరకొండ తాజాగా విడుదల చేశారు.

ఈ పాటను షేర్ చేస్తూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ''ఒక రోజు ఉదయం నిద్రలేవగానే భరత్ నుండి ఓ మెసేజ్ వచ్చింది.. అది ఆడియో ఫైల్.. నేను విని బాగా ఎమోషనల్ అయ్యాను. ఈ పాటను ఇంట్లో ప్లే చేస్తుంటే అమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం చాలాసార్లు చూశాను.. ఇప్పుడు ఈ పాట మీకోసం.. వినండి'' అంటూ రాసుకొచ్చారు.

ఈ పాటను సిద్ శ్రీరాం, ఐశ్వర్యా రవిచంద్రన్ పాడారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ బ్యానర్స్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జులై 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి