'పటాస్'కి శ్రీముఖి దూరం!

Published : May 15, 2019, 12:13 PM IST
'పటాస్'కి శ్రీముఖి దూరం!

సారాంశం

ప్రస్తుతం బుల్లితెరపై అనసూయ, రష్మిలతో పాటు శ్రీముఖి కూడా తనదైన మాటలతో యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది. 

ప్రస్తుతం బుల్లితెరపై అనసూయ, రష్మిలతో పాటు శ్రీముఖి కూడా తనదైన మాటలతో యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది. అప్పుడప్పుడు సినిమాల్లో నటించినా ఆశించిన బ్రేక్ మాత్రం రాలేదు. అయితే బుల్లితెర షో 'పటాస్'తో బాగా పాపులర్ అయింది.

ఆ షోలో రాములమ్మగా ఆమె చేసే హడావిడి షోలో ఉండే స్టూడెంట్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది. తన గ్లామరస్ లుక్స్ తో షోకి అందాన్ని తీసుకొస్తుంది. ఈ షో పాపులర్ కావడంతో శ్రీముఖి, రవి హోస్ట్ గా 'పటాస్ 2' కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఆ షోకి శ్రీముఖి దూరం కాబోతుంది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. కొద్దిరోజుల పాటు షోకి బ్రేక్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నిర్వాహకుల అనుమతితోనే బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపింది. తనను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకుఈ విషయం తెలియజేయాలని వీడియో చేసినట్లుగా తెలిపింది.

తనకు ఎంతో ఇష్టమైన షో పటాస్ అని, హృదయానికి చాలా దగ్గరైన షో అని చెబుతూ నిర్మాణ సంస్థ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కి కృతజ్ఞతలు తెలియజేసింది. మరి శ్రీముఖి బ్రేక్ తీసుకుంటుంది కాబట్టి మరే యాంకర్ ని ఈ షో కోసం తీసుకొస్తారో చూడాలి!

 

PREV
click me!

Recommended Stories

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే