విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

Published : Nov 08, 2018, 02:37 PM IST
విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

సారాంశం

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. ఆ రెండు సినిమాలు ఒక్కసారిగా విజయ్ మార్కెట్ ను క్రేజ్ ను పెంచేశాయి. అయితే గీత గోవిందం విషయంలో మాత్రం రిలీజ్ కు ముందు కొంత ఆందోళనగా ఉన్న చిత్ర యూనిట్ రిలీజ్ తరువాత రిజల్ట్ చూసి షాక్ అయ్యింది. 

ఎదో ఆడేస్తుందిలే అనుకున్నారు గాని 100కోట్ల గ్రాస్ అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే గీత గోవిందం ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకు క్రేజ్ రావడానికి బన్నీ ఎంట్రీ కూడా బాగా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు మరోసారి బన్నీ వస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని విజయ్ ఆలోచించాడట. 

నోటా సినిమాతో ఉహించని విధంగా డిజాస్టర్ అందుకున్న విజయ్ టాక్సీ వాలాతో తప్పకుండా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఈ నెల 11న నిర్వహించనున్న టాక్సీ వాలా ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీని స్పెషల్ గెస్ట్ గా స్వాగతం పలకనున్నారు. మరి ఈ సారి విజయ్ కి బన్నీ సెంటిమెంట్ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. టాక్సీ వాలా సినిమా ఈ నెల 17న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.    

 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్