మెగాస్టార్ ఇంట దీపావళి సంబరాలు.. పవన్ ఒక్కడే మిస్!

Published : Nov 08, 2018, 01:45 PM IST
మెగాస్టార్ ఇంట దీపావళి సంబరాలు.. పవన్ ఒక్కడే మిస్!

సారాంశం

ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మెగాస్టార్ ఇంట్లో దీపావళి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు మెగాఫ్యామిలీ మొత్తం హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగాహీరోలందరూ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు.

ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మెగాస్టార్ ఇంట్లో దీపావళి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు మెగాఫ్యామిలీ మొత్తం హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

మెగాహీరోలందరూ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు. సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ లు తెల్లపంచె కట్టుకొని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. వరుణ్ తేజ్, బన్నీల కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి కుర్తా పైజామాలో హుందాగా కనిపిస్తున్నారు.

ఈ హీరోలందరూ కలిసి తీసుకున్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. అలానే చిరంజీవిని మధ్యలో పెట్టి మెగాడాటర్స్, కోడళ్లు దిగిన ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఆయన ప్రజాపోరాట యాత్రలో బిజీగా ఉండడంతో ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. 


 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: కార్తీక్ కి బిగ్ షాక్-సుమిత్రకు బ్లెడ్ క్యాన్సర్-త్వరలో చనిపోతుందా?
Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే