విజయ్ దేవరకొండ మార్కెట్.. లక్ష నుంచి కోట్లవరకు!

First Published Feb 7, 2019, 9:24 PM IST

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించిన విజయ్ దేవరకొండ ప్రతి సినిమాను డిఫరెంట్ గా వదులుతున్నాడు. లక్ష నుంచు కోట్లవరకు అతని బిజినెస్ పరుగులు పెడుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న విజయ్ బాక్స్ ఆఫీస్ ట్రాక్ పై ఓ లుక్కిస్తే.. 

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించిన విజయ్ దేవరకొండ ప్రతి సినిమాను డిఫరెంట్ గా వదులుతున్నాడు. లక్ష నుంచు కోట్లవరకు అతని బిజినెస్ పరుగులు పెడుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న విజయ్ బాక్స్ ఆఫీస్ ట్రాక్ పై ఓ లుక్కిస్తే..
undefined
#పెళ్లి చూపులు: రియల్ లైఫ్ లో కామన్ గా మాట్లాడుకునే భాషలో వచ్చిన ఈ సినిమాను కేవలం 35రోజుల్లో కోటి రూపాయల్లో ఫినిష్ చేశారు. అయితే 14కోట్లకు పైగా సినిమా లాభాలను అందించింది. యూఎస్ లోనే 6 కోట్ల షేర్స్ అందించింది.
undefined
సెకండ్ ద్వారకా సినిమాతో వచ్చిన విజయ్ అంతగా క్లిక్ అవ్వలేకపోయాడు.మూడు కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కోటి రూపాయల షేర్స్ ను మాత్రమే రాబట్టింది.
undefined
అర్జున్ రెడ్డి: ఈ సినిమాతో విజయ్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. 30కోట్ల వరకు లాభాల్ని అందించిన ఈ బోల్డ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రౌడీ హీరోకు తనకంటూ ఒక స్థాన్ని ఏర్పరచింది. ఈ సినిమా బడ్జెట్ 4 కోట్లు
undefined
ఏ మంత్రం వేసావే: విజయ్ హీరోగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒకే చేసిన ఈ సినిమా వచ్చిన సంగతి చాలా మందికి తెలియదు. అర్జున్ రెడ్డి అనంతరం వచ్చినప్పటికి విజయ చప్పుడు చేయకపోవడంతో నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. సినిమా ఎవరికీ నచ్చలేదు. దీంతో 98లక్షల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. విజయ్ మొత్తం కెరీర్ లో ఇదే తక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా.
undefined
గీతగోవిందం: ఈ సినిమాతో యూత్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా విజయ్ దేవరకొండ దగ్గరయ్యాడు. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 70 కోట్లకు పైగా షేర్స్ ను అందించింది. ఇదే విజయ్ దేవరకొండ హైయ్యెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్.
undefined
నోటా: పొలిటికల్ డ్రామాగా వచ్చిన విజయ్ ఫస్ట్ ద్విభాషా చిత్రం. ఈ సినిమా విజయ్ బాక్స్ ఆఫీస్ ని గట్టిదెబ్బే కొట్టింది. 20 కోట్ల వరకు సినిమా కోసం ఖర్చు చేయగా 12 కోట్ల డబ్బును మాత్రమే సినిమా వెనక్కి తీసుకొచ్చింది.
undefined
టాక్సీ వాలా : ఈ సినిమా కూడా విజయ్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. 10 కోట్ల లోపే ఈ సినిమా కోసం ఖర్చు చేయగా 23 కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది.
undefined
ఈ విధంగా సక్సెస్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు విజయ్. అవకాశం వచ్చిన ప్రతిసారి బాక్స్ ఆఫీస్ ను గట్టిగానే దున్నేస్తున్నాడు.
undefined
ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు దర్శకుడైన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
undefined
మహానటి: సావిత్రి బయోపిక్ అయినప్పటికీ సినిమాకి విజయ్ స్టార్ డమ్ కూడా కొంత బజ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఎవడే సుబ్రహ్మణ్యపురం సినిమాతో లైఫ్ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ కోసం ఈ సినిమా ఒకే చేశాడు విజయ్. 17కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 40 కోట్ల వరకు లాభాల్ని అందించింది.
undefined
click me!