విజయ్ దేవరకొండ లాంచ్ చేసిన 'బలగం' .. ట్రైలర్ ఎలా ఉందంటే...

Published : Feb 27, 2023, 09:15 PM IST
 విజయ్ దేవరకొండ లాంచ్ చేసిన  'బలగం' .. ట్రైలర్ ఎలా ఉందంటే...

సారాంశం

తెలంగాణలోని పల్లెటూరి చుట్టూ తిరిగే కథాంశంతో బలగం ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పాడు దర్శకుడు.

తనదైన కామెడీ నవ్విస్తూ...ఒక్కోసారి సీరియస్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్దానం సంపాదించుకున్నాడు ప్రియదర్శి (Priyadarshi). ఆ మధ్యన వచ్చిన మల్లేశం సినిమాతో హీరోగా కూడా మారిపోయాడు. ఈ నటుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బలగం’. కావ్యా కల్యాణ్‌రామ్ (Kavya Kalyanram) ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ (Balagam Trailer)ను విజయ్ దేవరకొండ లాంఛ్ చేశాడు. 

తెలంగాణలోని పల్లెటూరి చుట్టూ తిరిగే కథాంశంతో బలగం ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పాడు దర్శకుడు. ట్రైలర్‌ ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్‌ లవ్‌ ట్రాక్‌, పెళ్లి.. ఇతర అంశాల చుట్టూ తిరుగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. 

రియలిస్టిక్ అప్రోచ్‌తో వెళ్దామనుకున్నప్పుడు ఈ కథ పుట్టిందని చెప్పిన వేణు.. ఈ ప్రాజెక్ట్ పెద్ద ప్రొడక్షన్‌ దగ్గరికి వెళ్లాక మార్కెట్ ఉన్న హీరో కావాలని డిసైడ్ అయినట్లు వెల్లడించారు. అలా ప్రియదర్శిని ఎంటర్ అయ్యాడని తెలిపాడు. నిజానికి ప్రూవ్ చేసుకునేందుకు తనకు కూడా ఒక ప్రొఫైల్ కావాలి కాబట్టి హీరో క్యారెక్టర్‌ను త్యాగం చేశానని చెప్పాడు. అయితే ఇది అర్థవంతమైన త్యాగమే అనిపించిందని.. ఆ క్యారెక్టర్‌కు ప్రియదర్శి పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యాడన్నాడు. మొత్తానికి హీరోగా చేద్దామనుకుని చివరకు ‘నర్సి’ ఒక చిన్న కామెడీ క్యారెక్టర్‌తో సరిపెట్టుకున్నానని తెలిపాడు. అయితే ఈ విషయం చెప్తుండగా కల్పించుకున్న హీరోయిన్ కావ్య.. డైరెక్టర్ మంచి క్యారెక్టర్ కొట్టేశాడని నారాయణ మూర్తి చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది.

ఈ చిత్రాన్నిశిరీష్‌ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 3న థియేటర్లలో సందడి చేయనుంది  ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మన సంస్కృతి, సంప్రదాయాలు, బంధుత్వాలు, సమస్యల మూలాలను గుర్తు చేసేలా సాగుతున్న బలగం ట్రైలర్‌ను లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం ప్రియదర్శి, వేణు‌, దిల్‌ రాజు టీంకు మంచి సక్సెస్‌ అందించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు విజయ్‌ దేవరకొండ. 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్