సౌత్ చిత్రాల్లో కనీసం లాజిక్ ఉండదు, పైగా పిచ్చి పాటలు.. సీనియర్ నటుడి అక్కసు, ఏకిపారేస్తున్న నెటిజన్లు

Published : Feb 27, 2023, 07:27 PM IST
సౌత్ చిత్రాల్లో కనీసం లాజిక్ ఉండదు, పైగా పిచ్చి పాటలు.. సీనియర్ నటుడి అక్కసు, ఏకిపారేస్తున్న నెటిజన్లు

సారాంశం

సౌత్ చిత్రాలు సాధిస్తున్న ఘనత చూసి బాలీవుడ్ మొత్తం నివ్వెరపోతోంది. బాలీవుడ్ స్టార్స్ అందరూ సౌత్ చిత్రాలపై, ఫిలిం మేకర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సౌత్ చిత్రాలు సాధిస్తున్న ఘనత చూసి బాలీవుడ్ మొత్తం నివ్వెరపోతోంది. బాలీవుడ్ స్టార్స్ అందరూ సౌత్ చిత్రాలపై, ఫిలిం మేకర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌత్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రాల కారణంగా ఇండియాలో భాషా బేధాలు తొలగిపోతున్నాయి. కానీ ఇప్పటికి కొందరు బాలీవుడ్ నటులు దక్షణాది చిత్ర పరిశ్రమపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. 

బాలీవుడ్ సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా తాజాగా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. సౌత్ చిత్రాల్లో కనీసం లాజిక్ ఉండదు అంటూ నజీరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో లాజిక్ ఉండదు. ఆ చిత్రాలు హిట్ అయినప్పటికీ లాజిక్ లెస్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని సన్నివేశాలు ఊహకి అందని విధంగా తీస్తారు. వీటికి తోడు పిచ్చి పిచ్చిగా పాటలు పెడతారు. 

ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి ఉండొచ్చు. కానీ లాజిక్ పాటించరు అంటూ నజీరుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల హిందీ చిత్రాల కంటే సౌత్ చిత్రాలే ఎక్కువగా ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి అనే విషయాన్ని నజీరుద్దీన్ అంగీకరించారు. 

నజీరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, పుష్ప, విక్రమ్ లాంటి అద్భుతమైన చిత్రాలు నజీరుద్దీన్ కి కనిపించడం లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

ఇటీవల బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రాలన్నీ బోల్తా కొడుతూ వచ్చాయి. నిరాశలో ఉన్న బాలీవుడ్ కి ఇటీవల విడుదలైన షారుఖ్ చిత్రం పఠాన్ ఊపిరి పోసింది అనే చెప్పాలి. గత కొన్నేళ్లల్లో బాలీవుడ్ కి దక్కిన అతిపెద్ద విజయం పఠాన్. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?