మహానటిలో ఏఎన్నార్ విజయ్ దేవరకొండ

Published : Nov 08, 2017, 06:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
మహానటిలో ఏఎన్నార్ విజయ్ దేవరకొండ

సారాంశం

అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి చిత్రం మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ మహానటిలో ఏఎన్నార్ పాత్ర కోసం విజయ్ దేవరకొండ ఎంపిక

అలనాటి అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎవడే సుబ్రమణ్యం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో సావిత్రి పాత్రలో యువనటి కీర్తిసురేష్‌ నటిస్తోంది.  అయితే సావిత్రి నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆమెతో నటించిన సహనటులు ఎన్టీఆర్,ఏఎన్ఆర్,ఎస్వీఆర్ లతో పాటు జమున తదితరులు ఆమె  లైఫ్ తో జర్నీ చేశారు.

 

ఇక  అప్పటి సినీ దిగ్గజాల పాత్రల కోసం ఈ జనరేషన్‌ లోని నటులను ఎంపిక చేస్తున్నారు.  సావిత్రి  భర్తగా జెమినీగణేషన్ పాత్రలో మాళీవుడ్ నటుడు దుల్కర్‌ సల్మాన్ ని తీసుకున్నారు.  మిగతా పాత్రల కోసం మోహన్‌ బాబు, ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌ లాంటి వారిని ఫైనల్‌ చేయగా దర్శకుల పాత్రలకు క్రిష్‌, తరుణ్‌ భాస్కర్‌ లను తీసుకున్నారు.

 

ఈ సినిమాలో మరో ముఖ్యపాత్ర కోసం అర్జున్ రెడ్డి ఫేమ్ దేవరకొండ విజయ్ ని తీసుకుంటున్నట్లు తెలిసింది.  తాజాగా సమాచారం ప్రకారం​ విజయ్‌, అలానాటి స్టార్‌ హీరో అక్కినేని నాగేశ్వర్రావు పాత్రలో నటించనున్నాడట. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ గా ఎవరు కనిపించినున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

పెళ్ళికి ముందే స్టార్ హీరోకి పుట్టిన నటి, 40 ఏళ్ల సెన్సేషనల్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Jan 28: అమూల్యను అర్థరాత్రి ఎత్తుకెళ్లి నిజస్వరూపం చూపించిన విశ్వక్