విజయ్ దేవరకొండ ఆగ్రహం.. అడల్ట్ వెబ్ సైట్స్ తో పోల్చేశాడు!

Published : Nov 15, 2018, 03:03 PM ISTUpdated : Nov 15, 2018, 03:05 PM IST
విజయ్ దేవరకొండ ఆగ్రహం.. అడల్ట్ వెబ్ సైట్స్ తో పోల్చేశాడు!

సారాంశం

నోటా సినిమాతో సక్సెస్ ట్రాక్ ను మిస్సైన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎలాగైనా ట్యాక్సీ వాలా సినిమాతో హిట్టుకొట్టాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు పైరేసి ఎఫెక్ట్ కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం.

నోటా సినిమాతో సక్సెస్ ట్రాక్ ను మిస్సైన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎలాగైనా ట్యాక్సీ వాలా సినిమాతో హిట్టుకొట్టాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు పైరేసి ఎఫెక్ట్ కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం. గతంలో గీత గోవిందం సినిమాకు కూడా ఇదే తరహాలో పైరేసి భయపెట్టిన సంగతి తెలిసిందే. 

అయితే ఆ సినిమా మాత్రం మంచి సక్సెస్ ను అందుకొని విజయ్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. అదే విధంగా మొదటి సారి 100కోట్ల గ్రాస్ ను అందుకున్నాడు ఈ హీరో. అయితే టాక్సీ వాలా పైరేసిని స్ప్రెడ్ చేస్తోన్న కొన్ని వెబ్ సైట్లపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాటిని బ్యాన్ చేయాలనీ కౌంటర్ ఇచ్చాడు. 

కొన్ని అడల్డ్ వెబ్ సైట్స్ పై గవర్నమెంట్ ఎలాగైతే నిషేధం విదించిందో అదే విధంగా పైరేసి కి ప్రచారం కలిగిస్తున్న వెబ్ సైట్లను కూడా బ్యాన్ చేయాలనీ అప్పుడే సినిమా ఇండస్ట్రీలకు మేలు జరుగుతుందని అన్నాడు. 

రీసెంట్ గా టాక్సీ వాలా ప్రమోషన్స్ కు సంబందించిన ఇంటర్వ్యూలో విజయ్ ఈ విధంగా తన వివరణ ఇచ్చాడు. ఇక సినిమా థియేటర్స్ లో సినిమాను చుస్తే తప్పకుండా అందరికి నచ్చుతుందని ట్యాక్సీ వాలా విజయంపై తమకు నమ్మకం ఉందని తెలిపాడు.

PREV
click me!

Recommended Stories

Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?
Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే