రిషబ్ శెట్టి – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో క్రేజీ మూవీ, భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా..?

Published : Mar 15, 2023, 02:17 PM IST
రిషబ్ శెట్టి – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో క్రేజీ  మూవీ, భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా  సినిమా..?

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురు చేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ ఒకటి  సౌత్ ఆడియన్స్ ను అలరించబోతోంది. కన్నడ స్టార్ డైరెక్టర్ కమ్ హీరో వృషబ్ శెట్టి.. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో  సినిమా తెరకెక్కబోతుంది.   

ప్రస్తుతం సౌత్ లో కాని.. బాలీవుడ్ లో కాని భాషాబేధం లేకుండా.. స్టార్ కాంబినేషన్లలో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా సౌత్ నుంచి టాలీవుడ్ సినిమా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. తెలుగు పరిశ్రమను ఆదర్శంగా తీసుకుని కన్నడ మేకర్స్ కూడా పాన్ ఇండియా మూవీస్ ను తెరకెక్కిస్తూ.. సక్సెస్ అవుతున్నారు. ఈక్రమంలో కన్నడ నాట నుంచి వచ్చి.. పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయిన సినిమా కాంతారా. ఈమూవీతో దర్శకుడిగా, హీరోగా మల్టీ టాలెంట్ చూపించాడు రిషబ్ శెట్టి. ఈసినిమా తరువాత వెంటనే ఆయనకు వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పబ్లిక్ గానే ఆయనకు నెక్ట్స్ మూవీ ఆఫర్ ఇచ్చారు. 

కాంతార బ్లాక్ బస్టర్ అవ్వడంతో రిషబ్ శెట్టి నెక్ట్స్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాని ఆయన నెక్ట్స్ ఏం సినిమా చేస్తాడు అనేదాంట్లో క్లారిటీ లేదు. కాంతారాకు సీక్వెల్ ఉంటుంది అని అనౌన్స్ చేశారు. అయితే రీసెంట్ గా ఓన్యూస్ ప్రకారం రిషబ్ శెట్టి , టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే రిషబ్ విజయ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడా..? లేకపోతే ఈ ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తారా అనేది మాత్రం క్లారిటీ లేదు. అసలు ఈ మూవీ గురించి కూడా ఎక్కడా అఫీషియలో అనౌన్స్ మెంట్ రాలేదు. కాకపోతే సౌత్ ఫిల్మ్ సర్కిల్ లో  ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

విజయ్ దేవరకొండ లైగర్  ఫ్లాప్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత  రీసెంట్ గా సమంత కూడా ఈ షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో  మూవీ షూటింగ్ పరుగులు పెట్టించబోతున్నారు. ఈసినిమా తరువాత విజయ్ దేవరకొండ రిషబ్ తో కలిసి సినిమా చేస్తారని టాక్. ఇక్కడ మరో విషయం ఏంటంటే..? అల్లు అరవింద్ నిర్మాతగా రిషబ్ కు సినిమా ఆఫర్ ఎలాగో ఉండనే ఉంది. ఈక్రమంలో విజయ్  హీరోగా రిషబ్ శెట్టి డైరెక్షన్ లో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి  ఇందులో నిజం ఎంతో.

గత ఏడాది కన్నడ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు సాధించాయి. అందులో కాంతార కూడా ఒకటి. ఆ సినిమా హీరో పేరు కానీ, హీరోయిన్ పేరు కానీ తెలుగు ప్రేక్షకులకు కనీసం తెలీదు. అయినా సరే ఆ మూవీ ఇక్కడ ఏకంగా రూ.50 కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ కలుపుకుని అయితే 400 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి వందల కోట్లు సాధించింది మూవీ. రిషబ్ శెట్టి ఈ సినిమాతో అటు దర్శకుడిగా.. ఇటు హీరోగా మంచి పేరు సాధించాడు.  త్వరలో కాంతార 2 కూడా తెరకెక్కించబోతున్నాడు. అయితే ఆసినిమా తరువాతే విజయ్ సినిమా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి