వీణా శ్రీవాణి వీణ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్. అయితే ఆమె వేణు స్వామి భార్య అని కొన్ని రోజుల క్రితం వరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం.సెలెబ్రిటీల కెరీర్ పై, జాతకాలపై వేణు స్వామి చేసే కామెంట్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. అయితే వేణు స్వామి వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన సతీమణి ఎవరో కాదు చిత్ర పరిశ్రమలో ఆమె వీణ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఆమె పేరు వీణ శ్రీవాణి.
వీణా శ్రీవాణి వీణ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్. అయితే ఆమె వేణు స్వామి భార్య అని కొన్ని రోజుల క్రితం వరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె పాల్గొనడం.. వేణు స్వామి, తాను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేణు స్వామికి ఇంత అందమైన భార్య ఉందా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన భర్త ని ఉద్దేశించి వీణా శ్రీవాణి చేసిన చిలిపి కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి.
undefined
వీణా శ్రీవాణి అరుదైన ట్యాలెంట్ తో సంగీత ప్రియులని ఆలరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ గెలవడంతో దేశావ్యాప్తంగా సినీ అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడం పట్ల ఆర్ఆర్ఆర్ టీంకి కంగ్రాట్స్ చెబుతున్నారు. చిత్ర యూనిట్, రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంతో తనదైన శైలిలో సెలెబ్రేట్ చేశారు. నాటు నాటు పాటకి తన వీణతో ట్రిబ్యూట్ అందించారు.
Let's Congratulate our RRR team.
I am very proud that Natu Natu is the first song from an Indian film to win the Oscar Award for best Original song; Great Honour!!! pic.twitter.com/J1v0jqhfcK
నాటు నాటు సాంగ్ బీట్ ని తన వీణతో అద్భుతంగా వాయిస్తూ అందరి హృదయాలు దోచుకుంటున్నారు. ఎంతో ఆహ్లాదంగా, వినసొంపుగా నాటు నాటు సాంగ్ ని ఆమె తన వీణలో ప్రదర్శించారు. వీణా శ్రీవాణి ట్యాలెంట్ కి నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. నీముఖంలో చిరునవ్వు,, వీణ నుంచి వస్తున్న సంగీతం ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి అంటూ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్ ఏం ట్యాలెంట్ భయ్యా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
శ్రీవాణి ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఆర్ఆర్ఆర్ టీంకి కంగ్రాట్స్ చెబుదాం. నాటు నాటు ఆస్కార్ సాధించిన తొలి ఇండియన్ సాంగ్ గా చరిత్ర సృష్టించింది. ఇది గొప్ప గౌరవం అంటూ వీణా శ్రీవాణి పోస్ట్ చేసింది.